Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?
- October 29, 2026 / 08:04 AM ISTByFilmy Focus Desk
ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి సెట్స్ మీద ఉండగా, మరో సినిమా రేపో మాపో సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక సెట్స్ మీద ఉన్న ‘దాదా’ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ సినిమాను డిసెంబరు 24న విడుదల చేస్తామని చెప్పిన నేపథ్యంలో బాలయ్య త్వరలోనే మరో సినిమాను ఓకే చేసేస్తాడు అని అంటున్నారు.
Shiva Nirvana – Balayya
ఎందుకంటే సెట్స్ మీద సినిమా ఉండగానే మరో సినిమా ఓకే చేసే రకం బాలయ్య. ఈ క్రమంలో ఆయన కొత్త సినిమా కోసం కథలు వింటున్నారట. అలా ‘ఇరుముడి’ సినిమాతో థియేటర్లలో మంచి విజయం అందుకున్న శివ నిర్వాణ కూడా ఓ స్టోరీ లైన్ చెప్పారట. దానికి బాలయ్య ఎగ్జైట్ అవ్వడంతో పూర్తి కథను సిద్ధం చేయమని చెప్పారట. దీంతో శివ అండ్ కో. అదే పనిలో బిజీగా ఉన్నారట. త్వరలోనే కథ ఫైనల్ చేస్తే.. నిర్మాత సంగతి తేల్చేస్తారట.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని టాక్. ఎందుకంటే శివ నిర్వాణ దగ్గర మైత్రీ వాళ్ల అడ్వాన్స్ ఉందట. అయితే ఈసారి మైత్రీ వాళ్లతోపాటు మరో నిర్మాణ సంస్థ కూడా కలుస్తుందని చెబుతున్నారు. ఈ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది. అంత పక్కాగా మైత్రీ ఎందుకంటే బాలకృష్ణ దగ్గర కూడా వాళ్ల అడ్వాన్స్ ఒకటి ఉందట. ఆ డీల్‌తోనే హరీశ్ శంకర్ – బాలయ్య సినిమా చేద్దాం అనుకున్నారని గతంలో వార్తలొచ్చాయి.
అయితే, ఇప్పుడు వచ్చే ప్రశ్న హరీశ్ శంకర్ పరిస్థితి ఏంటని. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తర్వాత ఆయన ఇంకే సినిమాకు రెడీ అవ్వలేదు. బాలకృష్ణకు, చిరంజీవికి కథ చెప్పారని వార్తలొచ్చాయి. ఇప్పుడు కొరటాల శివ సినిమాను బాలయ్య ఓకే చేస్తే హరీశ్ మరో హీరో వైపు చూడాల్సి వస్తుంది.
















