నాగశౌర్య కోపం సాయిపల్లవి మీద కాదు సినిమా మీద.!

“కణం” (తమిళంలో “దియా”) ప్రమోషన్స్ మొదలైనప్పట్నుంచి సినిమా ట్రైలర్, పోస్టర్స్ కంటే ఎక్కువగా అందర్నీ ఆకర్షించిన విషయం హీరో శౌర్యకి, హీరోయిన్ సాయిపల్లవికి నడుమ ఏదో జరిగింది అందుకే ఇద్దరూ కనీసం మొఖాలు కూడా చూసుకోవడం లేదన్న వార్త. శౌర్య కనీసం “కణం” సినిమా ప్రమోషన్స్ కి కూడా రాకపోవడంతో అందరూ నిజమే అనుకొన్నారు. కట్ చేస్తే.. సాయిపల్లవి సభాముఖంగానే కాకుండా మీడియా సాక్షిగా శౌర్యకి “నా వల్ల బాధపడి ఉంటే సారీ” అని చెప్పడంతో గొడవ సర్ధుమణిగి శౌర్య ప్రమోషన్స్ లో పాలుపంచుకొంటాడేమోననుకొన్నారు. కానీ.. సాయిపల్లవి సారీ కూడా శౌర్యకి కదిలించలేకపోయింది.

అందుకు కారణం లేకపోలేదు. నిజానికి శౌర్య కోపం సాయిపల్లవి తనను సరిగా ట్రీట్ చేయకపోవడం లేదా తనతో మాట్లాడకపోవడం గురించి కాదట. దర్శకుడు విజయ్ మొదట్లో కథ చెప్పినప్పుడు తన పాత్రకి, షూటింగ్ లో జరుగుతున్నప్పుడు తన పాత్రని ట్రీట్ చేసిన విధానం నచ్చలేదట. షూటింగ్ జరుగుతున్నప్పుడే తన పాత్ర పరిధి తగ్గిపోయిందని అర్ధమైపోయిన శౌర్య హీరోగా మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు తన పాత్రను ఇలా మలచడం తన కెరీర్ కి మంచిది కాదని ప్రాధేయపడినా దర్శకుడు విజయ్ ఏమాత్రం పట్టించుకోకుండా సాయిపల్లవికే ఎక్కువ సీన్లు పెట్టాడట. దాంతో కోపం వచ్చిన శౌర్య సినిమా షూటింగ్ అయిపోయి తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసిన అనంతరం సినిమా యూనిట్ నుంచి ఎవరు ఫోన్ చేసిన పట్టించుకోవడం మానేశాడట. సో, శౌర్య కోపానికి కారణం సాయిపల్లవి బిహేవియర్ కాదన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus