Naga Vamsi: సినిమా పోవడంతో డిప్రెషన్ లోకి పోయాము!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించారు. వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధము ఉందనే సంగతి మనకు తెలిసిందే. అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమాలలో అజ్ఞాతవాసి ఒకటి. ఈ సినిమా 2018 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా రెండు రోజులకే డిజాస్టర్ కావడంతో నిర్మాతలు భారీ స్థాయిలో నష్టపోయారు. ఈ విషయం గురించి నాగ వంశీ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని భావించాము కానీ రెండు రోజులకి ఈ సినిమా థియేటర్ల నుంచి తొలగించడంతో ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నామని తెలిపారు.

ఇలా ఈ సినిమా విషయంలో తాము పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయామని రెండు నెలల పాటు ఇతర ఏ విషయాల గురించి ఆలోచించలేదని కొన్నిచోట్ల ఈ సినిమా కారణంగా డిస్ట్రిబ్యూటర్లు రోడ్లపైకి కూడా వచ్చారు అంటూ ఈయన తెలియజేశారు అయితే ఇలా డిప్రెషన్ లో ఉన్నటువంటి తమకు ఎన్టీఆర్ సినిమా ఊపిరి పోసిందని నాగ వంశీ వెల్లడించారు. డిప్రెషన్ లో ఉన్న తమ వద్దకు త్రివిక్రమ్ వచ్చి మనం వెంటనే మరొక సినిమా ద్వారా ఇదే ఏడాది హిట్టు కొట్టాలని ఆయన అరవింద సమేత సినిమాని చాలా తక్కువ రోజులలో షూటింగ్ పూర్తి చేశారు.

ఇలా అదే ఏడాది అరవింద సమేత వీర రాఘవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చామని ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడంతో పవన్ కళ్యాణ్ సినిమా వల్ల వచ్చిన నష్టాలు అన్నింటిని కూడా ఎన్టీఆర్ సినిమా తీర్చింది అంటూ ఈ సందర్భంగా (Naga Vamsi) నాగ వంశీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus