ప్రముఖ యువ నిర్మాత నాగవంశీ రీసెంట్‌గా ఓ రెండు సినిమాల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఒకటి సూపర్ స్టార్ మహేష్‌బాబు సినిమా ‘గుంటూరు కారం’ కాగా.. రెండోది దుల్కర్ సల్మాన్ సినిమా ‘లక్కీ భాస్కర్’. ఒక సినిమా వారి బ్యానర్‌లో మంచి విజయం అందుకుంటే.. మరో సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక్కడ సమస్య అసలు అలాంటి ఫలితం ఎందుకు వచ్చింది అనే. అవును ఈ విషయాన్ని ఆయనే పలుమార్లు చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి అలాంటి మాటలే మాట్లాడారు. ఈ నేపథ్యంలో అప్పుడేమైందా అని చూస్తే.. మనకు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఆటోమేటిగ్గా నాగవంశీకి కూడా తెలిసే అవకాశం ఉంది.
పైన చెప్పినట్లు ఇప్పుడే కాదు ‘గుంటూరు కారం’ సినిమా రిలీజై ఇబ్బందికర ఫలితం అందుకోవడం ఆలస్యం నాగవంశీ ఆ సినిమాకు రావాల్సిన ఫలితం రాలేదు అని చెప్పడం మొదలెట్టారు. నిజానికి ఆయన చెప్పింది నిజమే. ఎందుకంటే ఆయన ఊహించిన ఫలితం రాలేదు. సినిమాను సినిమాగా ప్రచారం చేసి ఉంటే కచ్చితంగా వచ్చేది అని సినిమా పరిశీలకుల మాట. ఎందుకంటే సినిమాలో కీ ఎమోషన్ తల్లీ కొడుకు. కానీ సినిమా ప్రచారం అంతా మాస్ ఎలిమెంట్స్‌తో నింపేశారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అనే ఎమోషన్ టచ్ ప్రచార చిత్రాల్లో లేకపోవడంతో ఆశించిన కంటెంట్ లేదు అని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు.
ఈ విషయంలో సమస్య హైప్. సంబంధం లేని హైప్ ఇచ్చి హికప్స్ అందుకున్నారు. ఇక ‘లక్కీ భాస్కర్’ సినిమాకు సంబంధించి మంచి టాకే వచ్చినా.. దానిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో నాగవంశీ ఇబ్బందిపడ్డారు. ఆశించిన వసూళ్లూ రాలేదు అని అంటున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఆయన గతంలో చేసిన పనే. ఆ సినిమాకు కొన్ని రోజుల ముందు తాను రిలీజ్ చేసిన ఓ అగ్ర హీరో సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రచారం చేసిన నాగవంశీ ‘లక్కీ భాస్కర్’ను ఆ లెవల్ హైప్‌లోకి తీసుకురాలేదు. ఈ రెండు విషయాలు ఆయనకు తెలియనవి కావు. కానీ ఆయన ఆ రెండూ తనకు సర్‌ప్రైజ్‌లు అని ఇప్పుడు అంటున్నారు.