‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ ఇప్పుడు టాలీవుడ్లో టాప్ ప్లేస్ లో ఉన్న ప్రొడ్యూసర్. వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. థియేటర్లకు ఫీడింగ్ ఇస్తున్నారు.ఆయన సినిమాలు కూడా ఎక్కువ శాతం హిట్లు అవుతున్నాయి. ప్రస్తుతం సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న నిర్మాత ఇతనే. పైగా కొత్త టాలెంట్ తో ఇతను హిట్లు కొడుతున్నాడు అంటే.. నాగవంశీ ఎంత టాలెంటెడ్ అనేది అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇతని బ్యానర్ నుండి పెద్ద సినిమా వస్తుంది అంటే.. నాగవంశీ ఎక్కువ ప్రెజర్ ఫీలవుతుంటారు అనేది కొందరి అభిప్రాయం. ‘గుంటూరు కారం’ ‘డాకు మహారాజ్’ ‘కింగ్డమ్’ సినిమాల విషయంలో హీరోల కంటే ఎక్కువగా దగ్గరుండి అతనే కష్టపడి ప్రమోట్ చేశాడు. పెద్ద సినిమాల రిలీజ్ ప్రెజర్స్ ను హ్యాండిల్ చేయడం కూడా చిన్న విషయం కాదు.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘కింగ్డమ్’ తర్వాత నాగవంశీ నిర్మాణంలో రూపొందిన ‘మాస్ జాతర’ ఆగస్టు 27న రిలీజ్ కావాల్సి ఉంది. సినిమా రిలీజ్ కు కరెక్ట్ గా 20 రోజులు టైం మాత్రమే ఉంది. కానీ ఇంకా ప్రమోషన్స్ హడావిడి ఏమీ కనిపించడం లేదు. ఈ మధ్యనే సెకండ్ సింగిల్ వదిలారు. దానిపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో ప్రమోషన్ డోస్ పెంచాలి. కానీ నాగవంశీ ఇప్పట్లో ‘మాస్ జాతర’ ప్రమోషన్స్ ను పట్టించుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ‘వార్ 2’ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు నాగవంశీ. దాదాపు రూ.80 కోట్లు పెట్టి తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేశాడు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. దీని తర్వాత అంటే ఆగస్టు 15 తర్వాతే ‘మాస్ జాతర’ ప్రమోషన్స్ పై నాగవంశీ దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతుంది.