Posani, Nagababu: ‘కుక్కపిల్ల మొరిగిందనుకో’ నాగబాబు స్ట్రాంగ్ రిప్లై!
- September 29, 2021 / 07:20 PM ISTByFilmy Focus
ఇటీవల ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రులను పవన్ బాగా విమర్శించారు. దీంతో వైకాపా నేతలు పవన్ పై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి రెండు ప్రెస్ మీట్ లు పెట్టి మరీ పవన్ ని దూషించారు. పవన్ ను తిట్టే ప్రాసెస్ లో పోసాని లిమిట్స్ క్రాస్ చేశారనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు మెగాఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు.
తాజాగా నాగబాబు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘పవన్ కల్యాణ్ గురించి మాట్లాడు అన్నా’ అని ఓ అభిమాని అడగ్గా… గతంలో పవన్ గురించి పోసాని కృష్ణమురళి మాట్లాడిన వీడియో పోస్ట్ చేయడం గమనార్హం. అందులో భారతదేశంలో టాప్ హీరోల్లో పవన్‌కల్యాణ్ ఒకడని, అతను ఐదుకోట్లు, పదికోట్ల కోసం లంగా పనులు చేయడని పోసాని అన్న మాటలు వినిపించాయి.

ఆ తరువాత ‘పోసాని గురించి ఒక్క మాట’ అని మరో నెటిజన్ అడగ్గా.. ‘సమరసింహారెడ్డి’ సినిమాలో బాలకృష్ణ ‘కుక్కపిల్ల మొరిగిందనుకో’ అనే డైలాగ్ చెప్పే సీన్ ఫొటోను పెట్టారు. ఇదే సమయంలో తనకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ పోయిందని నాగబాబు చెప్పారు. మొత్తానికి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!
















