Nagababu: నిహారిక సినిమాలకు వడ్డీకి డబ్బులు ఇస్తున్న నాగబాబు?

మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతకు కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే ఇలా ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే మరోవైపు తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇక నాగబాబు కూడా వృత్తిపరంగా సినిమాలు రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారో ఇక తన కుమారుడు వరుణ్ తేజ్ కూడా సినిమాల పరంగా బిజీగా ఉండగా కుమార్తె నిహారిక సైతం వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారిపోయారు.

 

ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగబాబు నిహారిక గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన తర్వాత కొన్నిసార్లు డబ్బు అవసరమైతే వెంటనే నాకు ఫోన్ చేసి డాడీ ఇంత డబ్బు కావాలి అని అడుగుతుంది. అడిగిన వెంటనే ఇస్తాను అంటూ తెలియజేశారు.

ఇలా తన కూతురు అడిగిన డబ్బు తాను ఇస్తాను అని చెప్పడంతో వెంటనే యాంకర్ ఊరికే ఇస్తారా లేకపోతే వడ్డీకి ఇస్తారని అడగడంతో వడ్డీకే ఇస్తాను అంటూ సరదాగా సమాధానం చెప్పారు. ఇలా నా దగ్గర డబ్బు తీసుకొని తనకు వీలైనప్పుడు తిరిగి ఇస్తుంది లేకపోతే డాడీ నీకు నేను ఇవ్వాలి కదా అంటూ పదే పదే గుర్తు చేస్తుంది ఎక్కడ నేను వద్దు అని చెబుతానో పని పదేపదే చెబుతుందని నాగబాబు తెలిపారు. అలా చాలా సందర్భాలలో నేను తన దగ్గర తిరిగి డబ్బు తీసుకోలేదని తెలిపారు.

తన కుమారుడు కూడా తాను సంపాదించిన దాంట్లో డాడీ నీకు ఏదైనా అవసరమైతే తీసుకో అని నాకు చెబుతాడు కానీ నేను పిల్లల నుంచి ఎప్పుడు కూడా డబ్బు తీసుకోను నేను సంపాదించే స్థాయిలో ఉన్నాను నాకు ఇన్కమ్ వస్తుంది నేను సంపాదించినది నా పిల్లలకి ఇవ్వాలి కానీ వారి నుంచి నేను తీసుకోను అంటూ ఈయన చెప్పారు. ఇక వారికి తండ్రిగా వారి బాధ్యతలు నేను చూసుకుంటూ నేను వారికి ఇవ్వాలి కానీ వారి నుంచి ఎప్పుడూ డబ్బులు నేను తీసుకోనని ఈ సందర్భంగా నాగబాబు (Nagababu) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus