Nagababu, Niharika: మగాడి మైండ్ సెట్ ఇప్పటికి మారలేదు: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహతో కలిసి ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిఖిల్ నాగబాబును ప్రశ్నిస్తూ ఒకప్పుడు వివాహ బంధానికి చాలా ప్రాధాన్యత ఉండేది కానీ ప్రస్తుత కాలంలో ఎంతోమంది ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ తొందరగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు ఇలా బ్రేకప్ అవ్వడానికి కారణం ఏంటి అనే ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నాగబాబు సమాధానం చెబుతూ మగాడి మైండ్ సెట్ ఇప్పటికి మారకపోవడం కారణమని తెలిపారు.

అమ్మాయిలు మాత్రం రెబల్ ఆటిట్యూడ్ చూపిస్తూ ముందుకు పోతున్నారని అందుకే విడాకులు కూడా ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. కాలంలో అమ్మాయిలు అబ్బాయిలకు పోటీగా చదువులలో రాణిస్తున్నారు అబ్బాయిల కంటే మంచి రంగాలలో స్థిరపడి ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నారు. ఎవరి అవసరం లేకుండా అమ్మాయిలు స్వతంత్రంగా బ్రతికే స్టామినా వారిలో కనిపిస్తుంది అలాంటప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మగాడు తన చుట్టూ ఒక గెరి గీసి ఇందులోనే ఉండాలి

అంటే ఏ అమ్మాయి ఒప్పుకోవద్దు. సపోర్ట్ లేకుండా ఈమె స్వతంత్రంగా బతకగలదు అలాంటప్పుడు ఒకరు కింద తాను ఎందుకు బ్రతకాలి అన్న ఆలోచనలో అమ్మాయిలు ఉంటున్నారు. ఆలోచనలు రావడమే విడాకులకు కారణమవుతున్నాయని. పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంతోషంగా ఉందాం అలా కాదని ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని కండిషన్స్ పెడితే నేనెందుకు ఉండాలి అన్న ధోరణిలో అమ్మాయిలు ఉంటూ విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు.

అయితే ఇలా విడాకులు రావడానికి కారణం మగాడే అంటూ ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని ఈయన పరోక్షంగా తన కూతురు విడాకుల గురించి కూడా తన (Nagababu) అభిప్రాయాలను ఇలా తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus