Nagababu: మనోజ్‌ విషెష్‌.. నాగబాబు రియాక్షన్‌ వైరల్‌!

టాలీవుడ్‌లో చిరంజీవి వర్సెస్‌ మోహన్‌బాబు అనేది రోజూ జరగదు. కానీ సోషల్‌ మీడియాలో రెండు కుటుంబాల అభిమానులు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. చిరంజీవి కుటుంబం నుండి నేరుగా చిరంజీవి మాట్లాడరు. ఆయన సోదరులు మాత్రమే స్పందిస్తూ ఉంటారు. చాలా ఏళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. మోహన్‌బాబు కుటుంబం నుండి మోహన్‌బాబు, మంచు విష్ణు ఎక్కువగా దీని గురించి మాట్లాడుతుంటారు. కానీ మంచు మనోజ్‌ మాత్రం అందరితోనూ స్నేహం పాటిస్తూ ఉంటాడు. దీనికి మరో ఉదాహరణ ఇటీవల జరగింది.

మెగా బ్రదర్‌ నాగబాబు పుట్టిన రోజు నిన్న జరిగింది. ఈ నేపథ్యంలో సినిమా సెలబ్రిటీలు కొందరు… ఆయనకు విషెష్‌ చెప్పారు. ఈ క్రమంలో మంచు మనోజ్‌ కూడా విషెష్‌ చెప్పారు. నాగబాబు గారూ.. మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో ఉన్న పాజిటివ్‌ ఎనర్జీ మొత్తం మీకు అందాలి అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. అంతేకాదు దానికి నాగబాబు ఇచ్చిన సమాధానం ఇంకా వైరల్‌ అవుతోంది.

మనోజ్‌ ట్వీట్‌కు నాగబాబు స్పందిస్తూ… ‘థ్యాంక్యూ మనోజ్‌. ఈ విశ్వం మొత్తం ఎనర్జీతోనే నిండి ఉంది. అయితే దానిని పాజటివ్‌గా తీసుకోవాలా? లేక నెగిటివ్‌గా తీసుకోవాలా అనేది మన చేతుల్లో ఉంటుంది’ అని రాసుకొచ్చారు. దీంతో మంచు కుటుంబానికి నాగబాబు ట్వీట్‌తో కౌంటర్‌ ఇచ్చినట్లు అని నెటిజన్లు అంటున్నారు. మోహన్‌బాబు కుటుంబంతో మనోజ్‌ ఇలా ట్వీట్‌ చేసి అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తుంటే.. విష్ణు కామెంట్స్‌తో దూరం చేస్తున్నారని అంటున్నారు.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల సమయంలో మెగా వర్సెస్‌ మంచు అనే కాన్సెప్ట్‌ రన్‌ అయ్యింది. మెగా కుటుంబం ఆశీస్సులతో ప్రకాశ్‌ రాజ్‌ బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. ఈ క్రమంలో నాగబాబును ఉద్దేశిస్తూ మంచు క్యాంప్‌ నుండి కౌంటర్లు పడ్డాయి. దానికి ఆయన కూడా బలంగానే స్పందించారు. అలాంటిది ఇప్పుడు నాగబాబుకు మనోజ్‌ విషెస్‌ చెప్పడం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus