Naga Babu: అల్లుడు చైతన్యకు నాగబాబు సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్..!

2020 సంవత్సరం డిసెంబర్ నెల 9వ తేదీన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికకు, చైతన్య జొన్నలగడ్డకు ఘనంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత అల్లుడికి ఎలాంటి బహుమతులు ఇవ్వని నాగబాబు తాజాగా అల్లుడిని సర్ ప్రైజ్ చేశారు. నాగబాబు చైతన్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. ఉగాది పండుగకే అల్లుడికి కారును ఇవ్వాలని భావించినా కొన్ని కారణాల వల్ల కుదరలేదని నాగబాబు చెప్పుకొచ్చారు. నాగబాబు ఇచ్చిన రేంజ్ రేవర్ డిస్కవరీ కారు ధర దాదాపు 80 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం.

ఇందుకు సంబంధించిన వీడియోను నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం పండుగ రోజున లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజున అల్లుడికి నాగబాబు కారును ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. గిఫ్ట్ తీసుకున్న తరువాత చైతన్య కేక్ కట్ చేసి నిహారికకు తినిపించారు. పెళ్లి తరువాత నిహారిక వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలతో బిజీ అవుతున్నారు. చైతన్య కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని గతంలో ప్రచారం జరిగినా ఒక ఇంటర్యూలో చైతన్య మాట్లాడుతూ తనకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.

మెగా ఫ్యాన్స్ మాత్రం చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారని భావిస్తున్నారు. నిహారిక చైతన్య కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు బుల్లితెర షోలకు దూరంగా ఉన్న నాగబాబు సినిమాలతో బిజీ అవుతున్నారని సమాచారం.


‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus