Nagababu: ‘జనసేన’ పేరు చెప్పి నాగబాబు బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు

ఇప్పుడు రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల సినిమాలని ఏదో ఒక అకేషన్ చూసి రీ- రిలీజ్ చేస్తే ప్రెస్టేజ్ కోసమైనా సరే అభిమానులు వెళ్లి టికెట్ కొనుక్కుని థియేటర్లో సినిమా చూస్తున్నారు. ఆ ముచ్చట్లను స్టేటస్లుగా పెట్టి.. ఇంకో 10 మంది వెళ్లి సినిమాని చూసేలా ప్రేరేపిస్తున్నారు. అలా రీ రిలీజ్ చేస్తున్నా స్టార్ హీరోల సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ‘ఆరెంజ్’ సినిమాని రీ- రిలీజ్ చేస్తే..

జనాలు పెద్ద ఎత్తున వెళ్లి సినిమా చూశారు. కలెక్షన్స్ కూడా చాలా బాగా నమోదయ్యాయి. నిజానికి అది డిజాస్టర్ మూవీ అన్న సంగతి తెలిసిందే. నాగబాబుని నిండా ముంచేసిన సినిమా అది. అయితే ‘ఆరెంజ్’ కలెక్షన్స్ రూపంలో వచ్చిన అమౌంట్ ను ‘జనసేన’ పార్టీ ఫండ్ గా వాడతానని నాగబాబు పరోక్షంగా చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ కోసం ప్రాణమిచ్చే అభిమానులు వెళ్లి ‘ఆరెంజ్’ ను రీ రిలీజ్ టైంలో బ్లాక్ బస్టర్ గా నిలబెట్టారు.

అదే సీన్ ను ఇప్పుడు ‘గుడుంబా శంకర్’ సినిమా విషయంలో కూడా రిపీట్ చేయబోతున్నాడు (Nagababu) నాగబాబు. పవన్ కళ్యాణ్ తో నాగబాబు నిర్మించిన ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. వీర శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కామెడీ సూపర్ గా ఉంటుంది. అలాగే మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.

అందుకే ఏదో ఒక టైం చూసుకుని ఈ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేయాలని నాగబాబు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ ను కూడా జనసేన పార్టీ డెవలప్మెంట్ కోసం వాడతామని నాగబాబు చెబుతున్నాడు. సో ఈసారి కూడా సింపతీ యాంగిల్ వర్కౌట్ అయ్యి ‘గుడుంబా శంకర్’ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus