Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

  • July 3, 2026 / 10:53 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Cast & Crew

  • విరాట్ క‌ర్ణ‌ (Hero)
  • న‌భా న‌టేష్‌, ఐశ్వ‌ర్య మీన‌న్‌ (Heroine)
  • జ‌గ‌ప‌తిబాబు గ‌రుడ రామ్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అన‌సూయ‌, సోనియా సింగ్‌, అంకిత్ కొయ్య త‌దిత‌రులు (Cast)
  • అభిషేక్ నామా (Director)
  • కిషోర్ అన్న‌పురెడ్డి, నిషితా అన్న‌పురెడ్డి (Producer)
  • జునైద్ కుమార్, అభిషిక్త్ కొత్త‌ప‌ల్లి (Music)
  • సౌంద‌ర‌రాజ‌న్‌ (Cinematography)
  • ప్ర‌ణ‌వ్‌ (Editor)
  • Release Date : 3rd జూలై 2026
  • అభిషేక్ పిక్చ‌ర్స్‌, ఎన్ఐకే స్టూడియోస్‌ (Banner)

విరాట్ క‌ర్ణ‌, న‌భాన‌టేష్‌, ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన నాగ‌బంధం టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. మైథ‌లాజిక‌ల్ ఫాంట‌సీ యాక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌తో కిషోర్‌, నిషిత ఈ సినిమాను నిర్మించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన నాగ‌బంధం మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో విరాట్ క‌ర్ణ‌కు హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

Nagabandham Movie Review

Nagabandham Movie Review and Rating

క‌థ‌: ఆర్కియాల‌జీ ఆఫీస‌ర్ ప్ర‌భాక‌ర్ (జ‌గ‌ప‌తిబాబు) అల్లుడు టెస్లా నాగ‌బంధం తాలూకు బుక్ క‌నిపెడ‌తాడు. ఆ బుక్ కోసం టెస్లాతో పాటు అత‌డి భార్య రేవ‌తిని జుల్ఫిక‌ర్ అలీ (రిష‌బ్‌) చంపేస్తాడు. వారి కూతురి రియాను కిడ్నాప్ చేస్తాడు.రంగ‌నాథ స్వామి ఆల‌యంలో ఉన్న బ్ర‌హ్మ క‌మ‌లం తెచ్చి ఇస్తేనే రియాను వ‌దిలిపెడ‌తాన‌ని ప్ర‌భాక‌ర్‌తో పాటు అత‌డి కూతురు పార్వ‌తిల‌ను (న‌భా న‌టేష్‌) జుల్ఫిక‌ర్ అలీ బెదిరిస్తాడు. బ్ర‌హ్మ‌క‌మ‌లాన్ని ప్ర‌భాక‌ర్‌ దొంగిలించే క్ర‌మంలో అది భైర‌వ‌కోన‌లో ప‌డిపోతుంది. ఆ ప్రాంతానికి వెళ్లిన‌వాళ్లెవ్వ‌రూ ప్రాణాల‌తో తిరిగిరారు. చెల్లి పెళ్లికి అవ‌స‌ర‌మైన డ‌బ్బు కోసం రుద్ర (విరాట్ క‌ర్ణ‌) అక్క‌డికి వెళ‌తాడు.

అత‌డికి బ్ర‌హ్మ‌క‌మ‌లం దొరికిందా? రుద్ర చెల్లెలితో (సోనియా సింగ్‌) పాటు అత‌డి కుటుంబాన్ని జుల్ఫిక‌ర్ అలీ ఎందుకు చంపేశాడు? రుద్ర‌ను ప్రేమించిన పార్వ‌తి అత‌డికి ఎలాంటి ద్రోహం చేసింది? విరాట స్వామి ఆల‌యంలోని నాగ‌బంధాన్ని ఛేదించి గుడి త‌లుపులు తెర‌వాల‌ని భైర‌వ (గ‌రుడ రామ్‌) ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు? 17 శ‌తాబ్దానికి చెందిన నాగ సాధువుకు (విరాట్ క‌ర్ణ‌) రుద్ర‌కు ఉన్న సంబంధం ఏమిటి? శివుడి అండ‌దండ‌ల‌తో జుల్ఫీక‌ర్ అలీతో పాటు భైర‌వ‌ల‌ను రుద్ర ఎలా ఎదురించాడు? అన్న‌దే నాగ‌బంధం మూవీ క‌థ‌.

Nagabandham Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: నాగ‌సాధువుగా, రుద్ర‌గా డ్యూయ‌ల్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో విరాట్ క‌ర్ణ క‌నిపించాడు. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో మెప్పించాడు. లుక్ బాగుంది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో త‌డ‌బ‌డిపోయాడు. పార్వ‌తిగా విల‌నిజం ఛాయ‌ల‌తో కూడిన పాజిటివ్ పాత్ర‌లో న‌భాన‌టేష్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించింది. జ‌గ‌ప‌తిబాబు, ముర‌ళీ శ‌ర్మ‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌ల‌ అనుభ‌వాన్ని ద‌ర్శ‌కుడు బాగా వాడుకున్నాడు. విల‌న్‌గా రిష‌బ్ యాక్టింగ్‌, బాడీ లాంగ్వేజ్ డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. ఐశ్వ‌ర్య మీన‌న్, అన‌సూయ పాత్ర‌ల‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. సోనియా సింగ్‌, అంకిత్ కొయ్య న‌ట‌న ఒకే. గ‌రుడ‌రామ్ విల‌నిజం స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాలేదు. ద‌క్షా న‌గార్క‌ర్‌ది చిన్న రోలే.

Nagabandham Movie Review and Rating

సాంకేతిక నిపుణుల ప‌నితీరు: రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా నాగ‌బంధం మూవీతో అభిషేక్ నామా మెప్పించాడు. విజువ‌ల్ వండ‌ర్‌గా ఈ సినిమాను స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడు. శివుడి నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు గూస్‌బంప్స్ క‌లిగిస్తాయి. మైథాల‌జీకి మిస్ట‌రీ అంశాల‌ను జోడించి ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సినిమాను న‌డిపించారు. ద‌ర్శ‌కుడి క‌థ‌ను న‌మ్మి ప్రొడ్యూస‌ర్లు ఎక్క‌డ రాజీ ప‌డ‌కుండా సినిమా కోసం ఖ‌ర్చు చేశారు. భారీ వ్య‌యంతో సెట్స్ వేశారు. రంగ‌సాథ స్వామి ఆల‌య సెట్ చాలా రియ‌లిస్టిక్‌గా ఉంది. జునైద్ కుమార్‌, అభిషిక్త్ కొత్త‌ప‌ల్లి త‌మ సంగీతంతో భ‌క్తి ఫీల్‌ను క‌లిగించారు. న‌మోరే సాంగ్ బాగుంది. సౌంద‌ర్‌రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ నెక్స్ట్ లెవెల్‌. సినిమాకు లెంగ్త్ బిగ్గెస్ట్ మైన‌స్‌గా మారింది. మూడు గంట‌ల ప‌ద‌హారు నిమిషాల్లో ఈజీగా ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల వ‌ర‌కు ట్రిమ్ చేయ‌చ్చు.

Nagabandham Movie Review and Rating

విశ్లేష‌ణ‌: ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల‌లో మైథాల‌జీ సినిమాల ట్రెండ్ న‌డుస్తోంది. భ‌క్తి క‌థ‌ల‌తో రూపొందిన సినిమాల‌కు బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లో వ‌చ్చిన సినిమానే నాగ‌బంధం. కేర‌ళ‌లోని అనంత‌ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యంలోని ఓ గ‌దికి నాగ‌బంధం వేయ‌బ‌డి ఉంద‌నే క‌థ‌నం ప్ర‌చారంలో ఉంది. గ‌రుడ మంత్రం తెలిసిన సిద్దులు మాత్ర‌మే దానిని తెరువ‌గ‌ల‌ర‌ని పురాణాలు చెబుతున్నాయి. ఆ క‌థ నుంచి స్ఫూర్తి పొందే ద‌ర్శ‌కుడు అభిషేక్ నామా నాగ‌బంధం క‌థ‌ను రాసుకున్నారు. శివ‌త‌త్వం, రంగ‌నాథ స్వామి ఆల‌య వైభ‌వం లాంటి అంశాల‌ను సినిమాలో చూపించారు. అంతే కాకుండా ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం ఆయుధాలు చేప‌ట్టి నాగ‌సాధువులు ఎలాంటి పోరాటం సాగించార‌న్న‌ది నాగ‌బంధంలో ఆవిష్క‌రించారు.

కేవ‌లం మైథాల‌జీ అంశాల‌కే ప‌రిమితం కాకుండా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, ల‌వ్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. భైర‌వ‌కోన ఎపిసోడ్‌, జుల్ఫీక‌ర్ అలీతో పాటు అత‌డి సైన్యాన్ని ఎదురించి నాగ‌సాధువులు చేసే పోరాటం, మాన‌స దేవి టెంపుల్ ఫైట్ బాగున్నాయి. హిందూమ‌తంతో పాటు స‌నాత‌న ధ‌ర్మ గొప్ప‌త‌నాన్ని డైలాగ్స్ ద్వారా చెప్పిన తీరు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది.

బ్ర‌హ్మ‌క‌మ‌లాన్ని ద‌క్కించుకోవ‌డానికి విల‌న్లు చేసే ప్ర‌య‌త్నాలు, వారిని ఎదురించే హీరో…ఈ చిన్న పాయింట్ చుట్టే నాగ‌బంధం క‌థ అల్లుకున్నారు. స్టోరీ ఎంత‌కు ముందుకు క‌ద‌ల‌క అక్క‌డే తిరుగుతున్న అనుభూతి క‌లుగుతుంది. ఐశ్వ‌ర్య మీన‌న్‌, అన‌సూయ‌, శ‌ర‌ణ్య‌తో పాటు చాలా మంది న‌టీన‌టులు సినిమాలో క‌నిపిస్తారు.నాలుగైదు మిన‌హా మిగిలిన పాత్ర‌ల‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. విరాట‌స్వామి ఆల‌య త‌లుపులు తెర‌వాల‌ని భైరాగి ఎందుకు అనుకుంటున్నాడ‌న్న‌ది చూపించేదు. ఆ ట్విస్ట్ రెండో పార్ట్‌లో చూడాల్సిందేన‌ని ప్ర‌క‌టించారు. పాట‌లుక‌థా గ‌మ‌నానికి అడ్డుగా మారాయి. ర‌న్ టైమ్ సినిమాకు బిగ్గెస్ట్ మైన‌స్‌.

Nagabandham Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: నాగ‌బంధం సినిమాలో విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్, టెక్నిక‌ల్ వాల్యూస్ విష‌యంలో వంకా పెట్ట‌లేం. అంతా అద్భుతంగా ఉన్నాయి. కానీ కీల‌క‌మైన క‌థ విష‌యంలోనే సినిమా వీక్‌గా ఉంది.

రేటింగ్ : 2.5/5

Click Here To Read in ENGLISH

 

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Nama
  • #Anasuya Bharadwaj
  • #B. S. Avinash
  • #Daksha Nagarkar
  • #Garuda Ram

Reviews

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

55 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

6 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version