సమంతపై సంచలన కామెంట్స్ చేసిన నాగచైతన్య
- May 19, 2017 / 06:15 AM ISTByFilmy Focus
ఏమాయ చేసావే సినిమాలో ప్రేమికులుగా నటించిన నాగ చైతన్య, సమంతలు నిజజీవితంలోనూ లవర్స్ అయ్యారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్ధం జరుపుకున్నారు. ఈ ఏడాది ఆలుమగలు కాబోతున్నారు. అయితే ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించే వీరిద్దరూ తాజాగా ఆరోపణల ట్రాక్ ఎక్కారు. నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఈ నెల 26న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చైతూ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ‘నాకు వ్యక్తిగత విషయాలన్నీ సోషల్‌మీడియాలో పంచుకోవడం నచ్చదు.
కానీ సామ్ మాత్రం ఫొటోలు తీస్తూనే ఉంటుంది. ఇక తర్వాత ఎటూ సోషల్ మీడియాలో పెట్టేస్తుందనుకోండి” అంటూ సమంతపై చిరు కోపాన్ని వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం సమంత, నాగ చైతన్య కలిసి ఉన్న ఫోటోలు అనేకం సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీని గురించి ఇంకా మాట్లాడుతూ.. “నాకు అలా నచ్చకపోయినా నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మళ్లీ నాకు రాదు. పెళ్లికి ముందు ఈ ఎమోషన్స్, సెలబ్రేషన్స్ జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి. కాబట్టి నేనూ, సామ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చూసి ఎవరైనా వాటి గురించి అడిగితే నవ్వి ఊరుకుంటా’ అని నాగ చైతన్య వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














