నవ్వులకి ఇక గుడ్ బై చెప్పనున్న రోజా.. కారణం అదే..?

‘జబర్దస్త్’ షో కి ఎంత క్రేజ్ ఉందో.. ఈ షో కి జడ్జిలు గా వ్యవహరించే రోజా, నాగబాబులకు కూడా అంతే క్రేజ్. ఓ స్కిట్ కు వీరు నవ్వితేనే ఆ స్కిట్ కు నిండుతనం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. అయితే ఇప్పుడు ఇద్దరూ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ‘జబర్దస్త్’ కు దూరంగా ఉంటూ వచ్చారు. రోజా తిరిగి ‘జబర్దస్త్’ లో జాయినయ్యారు కానీ నాగబాబు జాయినవ్వలేదు. ఇదిలా ఉంటే… గతంలో ఎమ్మెల్యేగా గెలిచినా… రోజా ఈ షోలో పాల్గొంటూ వచ్చారు. రాజకీయాల్ని, జబర్దస్త్ ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు రోజా. అయితే ఇక పై ‘జబర్దస్త్’ కు రోజా గుడ్ బై చెప్పబోతుందని టాక్ నడుస్తుంది. రెండవసారి కూడా రోజా ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ సారి వైసిపి అధికారంలోకి వచ్చింది.

ఈ క్రమంలో ఆమెకు పొలిటికల్ గా మరింత భాద్యతలు పెరిగే అవకాశం ఉందట. మరో కీలక అంశం ఏంటంటే జగన్ కేబినెట్ లో రోజాకు మంత్రి పదవి కూడా ఖాయమనే ప్రచారం జరుగుతుంది.
ఒకవేళ అదే జరిగితే… తప్పనిసరిగా జబర్దస్త్ ని వదిలేయాల్సి ఉంటుందట. మహిళా ఎమ్మెల్యేలలో కీలకంగా ఉన్నది రోజానే కాబట్టి ఆమెకు మంత్రి పదవి లాంఛనమే అని బలమైన నమ్మకమే కనపరుస్తున్నారు వైసీఫై నేతలు. ఎలాగైనా రోజా జబర్దస్త్ ని వదిలేయక తప్పేలా లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus