అఖిల్ కెరీర్ గురించి నాకేం కంగారు లేదు: నాగార్జున

తాను నటించిన లేదా నిర్మించిన సినిమాలను ప్రమోట్ చేయడం అగ్ర కథానాయకుడు నాగార్జున ఎప్పుడూ ముందంజలో ఉంటాడు. ఇక ప్రమోషన్స్ సందర్భంగా మీడియా మిత్రులు లేదా యాంకర్లు అడిగే ప్రశ్నలకు ముక్కుసూటిగా నాగార్జున చెప్పే సమాధానాలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే మారుతుంటాయి. రేపు “మన్మధుడు 2” ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా.. భీభత్సమైన ప్రమోషన్స్ తో సినిమాని జనాలకి మరింత చేరువ చేస్తున్నాడు నాగార్జున.

ఈ సందర్భంగా అఖిల్ ఇంకా కెరీర్ పరంగా సెటిల్ అవ్వలేదు కదా.. మీకు బాధగా లేదా అని ప్రశ్నించినప్పుడు, నాగార్జున సమాధానమిస్తూ.. “నేను కెరీర్ మొదలెట్టినప్పుడు కూడా ఇలానే అన్నారు. డిస్కరేజ్ చేసినవాళ్లే ఎక్కువ, నాగచైతన్య మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అదే తరహాలో నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది. ఇప్పుడు అఖిల్ విషయంలోనూ అదే జరుగుతోంది. అఖిల్ ఆల్రెడీ యాక్టర్ గా ప్రూవ్ చేసుకొన్నాడు. వాడికి కావాల్సిందల్లా ఒక ప్రోపర్ హిట్. త్వరలోనే దాన్ని కూడా ఎచీవ్ చేస్తాడు. హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకొంటాడు” అని చెప్పుకొచ్చాడు నాగార్జున. ఒక తండ్రిగా తన పిల్లల మీద నాగార్జునకు ఉన్న కాన్ఫిడెన్స్ చూసి ఎవరైనా కుళ్లుకోవాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus