Nagarjuna: బర్త్ డే స్పెషల్: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..
- August 29, 2026 / 05:28 PM ISTByFilmy Focus Desk
నాగార్జున గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఫిట్‌నెస్ గురించి, లుక్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే నేటి తరం యంగ్ హీరోలకు పోటీగా ఆయన లుక్స్, బాడీని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు (ఆగస్టు 29) ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓసారి ఈ విషయాల గురించి కాకుండా.. ఆయన సినిమాల ఎంపిక గురించి చూద్దాం. ఎందుకంటే తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ సినిమాలో కూడా ఆయనలా కథలను ఓకే చేసి, రిస్క్ చేసి.. పాత్రలు చేసిన వారు అరుదు కాబట్టి.
Nagarjuna

* హీరోగా కెరీర్ ప్రారంభమై మూడు సినిమాలే చేశారు. ఆ టైమ్‌లో అంటూ గడ్డం పెంచుకుని, అమ్మాయి దూరమైందని దిగాలు లుక్‌తో ఓ పాత్ర అంటే ఏ హీరో కూడా ముందుకు రారు. కానీ మన ‘మజ్ను’ చేశాడు.
* ఆ హీరోయిన్‌కి అప్పటికే స్టార్ అనే పేరు. ఆమెతో సినిమా చేస్తే ప్రేక్షకులు ఆమెనే చూస్తారు అని తెలిసి కూడా ఓ సినిమా చేసిన హీరోలు ఉంటారా. కానీ విహారి (ఆఖరి పోరాటం) ఆ పని చేశాడు. మెప్పు పొందాడు.
* హీరో అంటే గలగలా మాట్లాడాలి. డాషింగ్ లుక్‌లో కనిపించాలి. ఆరోగ్యవంతుడిగా ఉండాలి అనుకునే రోజుల్లో మరికొద్ది రోజుల్లో చనిపోయే హీరో పాత్ర ఎవరైనా హీరో చేయడానికి ముందుకొస్తారా? కానీ ‘గీతాంజలి’తో ప్రకాశ్ చేశాడు.
* ఎవరి దగ్గరా దర్శకత్వ శాఖలో పని చేయని, పెక్యూలియర్ మైండ్ సెట్ ఉన్న కుర్రాడు వచ్చి సినిమా చేద్దాం అని కథ చెబితే అంత ఈజీగా ఎవరూ చేయకపోవచ్చు. కానీ మన ‘శివ’ చేశాడు. చరిత్ర సృష్టించాడు.
* స్టార్ హీరో సినిమా అంటే ఆరు పాటలు. మూడు ఫైట్లు అనుకుంటున్న ఆ రోజుల్లో ‘చైతన్య’ అంటూ వచ్చి.. మొత్తం లెక్కలను మార్చేశాడు. సినిమా అంతా జీపు రేసింగ్‌తోనే సరిపోతుంది.
* ఇప్పుడంటే యాంటీ హీరో పాత్రలు స్పెషల్‌గా కనిపిస్తున్నాయి కానీ.. ఈ ప్రయత్నం ఎప్పుడో ఈశ్వర్ ప్రసాద్/ ప్రేమ్ కృష్ణగా ఆ పని చేసి చూపించాడు. ఎందులోనో తెలుసు కదా.. ‘కిల్లర్’ లో.
* అండర్ వరల్డ్, కింగ్డమ్‌లు ఇప్పుడు మనకు పాన్ ఇండియా ట్రెండ్‌లు అయిపోయాయి. కానీ ఇలాంటి ప్రయత్నం ఎప్పుడో ‘అంతం’ టైమ్‌లోనే చేసేశాడు రాఘవ/శేఖర్.
* స్టార్ హీరోలు కొన్ని రకాల సినిమాలు చేయాలి. అందులో భక్తిరస చిత్రాలు ఉండవు అనే మాట ఒకటి ఉండేది. ఈ లెక్కన ‘అన్నమయ్య’ సినిమాతో పటాపంచలు చేశాడు. ఆ తర్వాత అదే కోవలో మరో రెండు సినిమాలూ చేశాడు.
* ‘నాక్కొంచెం మెంటల్’.. ఈ డైలాగ్‌ని ఓ స్టార్ హీరో చెబితే.. ఇప్పుడు ఇవి కామన్. కానీ హీరో ఆల్వేజ్ ఆన్ టాప్ అని ఫ్యాన్స్ అనుకునే రోజుల్లోనే ఇలాంటి క్యారెక్టరైజేషన్‌తో ‘శివమణి’గా వచ్చాడు.
* సినిమా అంతా మీరు చక్రాల కుర్చీలోనే కనిపిస్తారు – ఎవరైనా రైటర్/ డైరెక్టర్ వచ్చి ఈ స్టోరీ లైన్ చెబితే.. ‘థ్యాంక్యూ అని చెప్పేసి పంపించే’ హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఇండస్ట్రీకి తన ప్రయోగంతో ‘ఊపిరి’ పోశాడు.
* సినిమాలో మీరు ఉంటారు కానీ.. ఆత్మలా కనిపిస్తారు.. ఈ మాట స్టార్ హీరోలకు అంతగా రుచించకపోవచ్చు. కానీ అలాంటి సినిమాలు చేసి ఇండస్ట్రీకి, అభిమానులకు తన సత్తాను మరోసారి రుచి చూపించాడు ‘బంగార్రాజు’.
* సీనియర్ హీరోలు ఇంకా హీరోగానే రన్ అవుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో ‘కుబేర’ అనే సినిమా ఒప్పుకొని షాకిచ్చాడు. అందులో తన పాత్ర హీరో కాదు, విలన్ కాదు. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. వాటిని ఎంత బాగా హ్యాండిల్ చేశాడో దీపక్.
* స్టార్ హీరో సినిమా చిన్న పాత్ర చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న హీరోలున్న రోజులివి. ఇంకా ఉన్నారా అంటే ఉన్నారు మరి. ఈ సమయంలో సైమన్‌గా మారి ‘కూలీ’కి పోటాపోటీగా బరిలోకి దిగారు. సైమన్ సెన్సేషనల్ అయ్యాడు కూడా.
* ఇప్పుడు ‘కింగ్ 100’గా వస్తున్నాడు. గ్లింప్స్‌లో అయితే కొత్త నాగార్జున కనిపించాడు. సినిమా సంగతి డిసెంబరు 24న తేలుతుంది.
అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్












