తెలుగు దర్శకులు అటు బాలీవుడ్ హీరోల వైపు వెళ్తుంటే.. మన హీరోలు తమిళ దర్శకుల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు అగ్ర హీరోలు దాదాపు ఒకే సమయంలో తమిళ దర్శకులు స్క్రిప్ట్‌లకు ఓకే చెప్పారు అని టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సినిమాల భారీ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అవుతాయా? లేక కేవలం తెలుగు వరకే పరిమితం చేస్తారా అనే విషయం మాత్రం తేలలేదు.
ఆ హీరోలు బాలకృష్ణ (Nandamuri Balakrishna), నాగార్జున (Nagarjuna) అయితే.. ఆ దర్శకులు అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran), రా కార్తిక్ అంటున్నారు. నాగార్జున గత కొన్ని ఏళ్లుగా తన వందో సినిమా గురించి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతేడాది ‘నా సామిరంగ’తో (Naa Saami Ranga) 99 సినిమాలు పూర్తి చేసుకున్న నాగ్ వందో సినిమా అనౌన్స్ చేసేస్తారు అని వార్తలొచ్చాయి. కానీ కథ విషయంలో చర్చలు ఓ కొలిక్క రాక ఆగిపోతూ వచ్చింది. ఈ క్రమంలో ఆ సినిమా కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి.
అందులో ‘గాడ్ ఫాదర్’ (Godfather) ఫేమ్ మోహన్ రాజా (Mohan Raja) పేరు కూడా బలంగా వినిపించింది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్‌లో రా కార్తిక్ వచ్చారని టాక్. ‘నితమ్ ఒరు వానమ్’ అనే సినిమాతో మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారాయన. ఈ సినిమాకు ‘కింగ్’ అనే పేరుతో టైటిల్ ఉండొచ్చు అంటున్నారు. ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. అజిత్‌తో (Ajith Kumar) రీసెంట్‌గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమా చేసిన ఆధిక్ రవిచంద్రన్ ఇటీవలే బాలయ్యకు ఓ కథ చెప్పారని సమాచారం.
సినిమా పాయింట్ నచ్చిందని, పూర్తి నెరేషన్‌కు సిద్ధమవ్వమని బాలయ్య సూచించారు అని టాక్. దీనికి ఎక్కువ రోజులు పట్టదని త్వరలో చెప్పేసి అధిక్ ఓకే చేసుకుంటారు అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు ఓకే అనుకుంటే ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) సినిమా తర్వాత ఇదే ఉండొచ్చు అని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, లెజెండ్ ప్రొడక్షన్స్ కలసి ఆ సినిమా చేస్తాయి అంటున్నారు.