నాగార్జున – రామ్ గోపాల్ వర్మల ‘ఆఫీసర్’ చిత్ర టీజర్ ఏప్రిల్ 9 న విడుదల!

తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘శివ’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. ‘అంతం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ‘ఆఫీసర్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేయడం మరో విశేషం.

నేడు రామ్ గోపాల్ వర్మ జన్మదినం సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. టీజర్ ఏప్రిల్ 9 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. మే 25 ను చిత్ర విడుదల తేదీ ఖరారు చేశారు.

మైరా శరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో అజయ్ మరియు సాయాజీ షిండే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆఫీసర్ చిత్రాన్ని సుధీర్ చంద్ర మరియు రామ్ గోపాల్ వర్మ కంపెనీ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus