Nagarjuna: స్టార్స్ పెళ్లికి వెళ్తే అన్ని రూ.కోట్లు ఇస్తారా.. అప్పట్లో నాగ్ ఏం చెప్పారంటే?

ఈ ఏడాది నా సామిరంగ (Naa Saami Ranga) సినిమాతో నాగార్జున (Nagarjuna) మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. బడ్జెట్ బిజినెస్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. అయితే గతంలో ఒక సందర్భంలో నాగార్జున చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. కొంతమంది వ్యాపారవేత్తలు కోట్ల రూపాయలు ఇచ్చి సెలబ్రిటీలను పెళ్లిళ్లకు ఆహ్వానిస్తున్నారని నాగ్ తెలిపారు. వివాహాలకు డబ్బులు ఇచ్చి తీసుకొస్తుంటే ఏం చెబుతామని ఆయన కామెంట్లు చేశారు.

మా పెళ్లికి వస్తే డబ్బులు ఇస్తామనే ఆఫర్లు నాకు కూడా వచ్చాయని అయితే అలాంటి ఆఫర్లకు తాను అంగీకరించలేదని నాగార్జున కామెంట్లు చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు అలా పెళ్లిళ్లకు వెళ్తారని వారి రెమ్యునరేషన్ కోటి రూపాయల వరకు ఉంటుందని నాగార్జున చెప్పుకొచ్చారు. అయితే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల వల్ల ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు పలువురు బాలీవుడ్ హీరోలు హాజరై డ్యాన్స్ లు చేసిన సంగతి తెలిసిందే.

అందువల్ల నాగ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగార్జున ప్రస్తుతం (Dhanush) ధనుష్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నాగార్జునకు ప్రస్తుతం కెరీర్ పరంగా భారీ హిట్ అవసరం కాగా ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందని చెప్పవచ్చు.

నాగార్జున కొడుకులు (Naga Chaitanya) నాగచైతన్య, అఖిల్ (Akhil) భారీ విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాగార్జున పారితోషికం ప్రస్తుతం 14 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాగార్జునను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. నాగార్జున వయస్సు పెరుగుతున్నా తన ఎనర్జీ లెవెల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus