Nagarjuna: ”ఏం తినాలో.. ఏం చేయాలో కూడా వాళ్లే చెప్తారు”

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు, సాధారణ ప్రజలకు మధ్య దూరం బాగా తగ్గింది. నెటిజన్లు నేరుగా సెలబ్రిటీలు ప్రశ్నించడం కామన్ అయిపోయింది. అయితే ఒక్కోసారి కొందరు నెటిజన్ల కారణంగా సెలబ్రిటీలు ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో హీరో నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో రానా నిర్వహిస్తోన్న ‘నెంబర్ 1 యారీ’ షోలో పాల్గొన్నాడు నాగ్.

ఈ షోలో సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. సోషల్ మీడియాను ఎలా హ్యాండిల్ చేస్తుంటారని రానా ప్రశ్నించగా.. దానికి నాగార్జున అంతగా యాక్టివ్ గా ఉండనని చెప్పారు. ఆరేడేళ్ల క్రితం ట్విట్టర్ కొత్తగా వచ్చిన సమయంలో అకౌంట్ ఓపెన్ చేశానని.. దాని తరువాత ఒకటి, రెండు సంవత్సరాల్లో అది ఒపీనియేటెడ్, నెగెటివ్.. ఆ నోటిఫికేషన్స్ యాక్సెప్ట్ చేస్తే మన లైఫ్ మనం మార్చేసుకోవాలని అన్నారు. రేపు పొద్దున నేను ఏం బట్టలు వేసుకోవాలి..

ఏం తినాలి.. ఏం చేయాలి.. అన్నీ వాళ్లే చెప్తారని అన్నారు. ఎవరో అనామకులు, నాకు తెలియని వాళ్లు.. నా లైఫ్‌లో నేను ఎలా ఉండాలో చెబుతుంటే నా వల్ల కావడం లేదని అప్పటినుంచి నోటిఫికేషన్స్ ఆఫ్ చేశానని చెప్పుకొచ్చారు. నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus