‘బంగార్రాజు’ కి అన్నీ ప్లాప్ సెంటిమెంట్లే…?

అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున… బంగార్రాజుగా పాత్రకి కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ‘బంగార్రాజు’ పేరుతోనే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పనులు పూర్తయిపోయాయి.

నాగార్జున సొంత బ్యానర్ అయిన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్లోనే ఈ చిత్రం నిర్మితమవ్వనుంది. ఎన్నికలు పూర్తవ్వగానే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన రానుంది. ఆగస్టు మొదటి వారం నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన స్టార్ హీరోయిన్ నయనతార ను తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈమద్యే దర్శకుడు కళ్యాన్ కృష్ణ ఆమెను కలిసి కథ వినిపించగా… ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. గతంలో నాగార్జున వీరిద్దరి కాంబినేషన్లో ‘బాస్’ ‘గ్రీకువీరుడు’ వంటి చిత్రాలు వచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ప్లాపయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబినేషన్ అనేసరికి నాగార్జున ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. అందులోనూ ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన గత చిత్రం ‘నేల టికెట్’ కూడా డిజాస్టర్ కావడం నాగ్ అభిమానులు మరింత టెన్షన్ పడుతున్నారని తెలుస్తుంది. మరి ఇన్ని ప్లాప్ సెంటిమెంట్లతో ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus