అఖిల్ ని అభినందనలతో ముంచెత్తిన నాగార్జున

కొడుకు గొప్ప పని చేసినప్పుడు, అది చూసి అందరూ అభినందించినప్పుడు ఆ తండ్రి ఎంతో ఆనందిస్తాడు. ఆ సంతోషంలోనే అక్కినేని నాగార్జున ఉన్నారు. అతని చిన్న కుమారుడు అఖిల్ నిన్నరాత్రి దుబాయ్ లోని అబుదాబి వద్ద జరిగిన సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎప్పుడూ డ్యాన్స్ లతో అదరగొట్టే అఖిల్ ఈ సారి తన సింగింగ్ ట్యాలెంట్ ని బయటపెట్టారు. అఖిల్ పాడుతుంటే ఆహ్వానితులంతా ఆశ్చర్యపోయారు. అతని గొంతులోని మాధుర్యానికి ఫిదా అయిపోయారు. చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆ ఆహ్వానితుల్లో నాగార్జున కూడా ఉన్నారు.

కొడుకు ప్రదర్శన చూసిన తర్వాత… “అఖిల్ చాలా చక్కగా పాడాడు. అలా అతను పాడేందుకు ఎంత సాధన చేసాడో నాకు తెలుసు. దాని ఫలితం నాకు ఆనందాన్ని కలిగించింది. ” అంటూ నాగ్  ట్విట్టర్ వేదికపై కొడుకుకి అభినందలు తెలిపారు. అఖిల్  ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus