Bigg Boss 7 Telugu: హౌస్ మేట్స్ లో బడ్డీస్ పై నాగ్ ఫైర్..! కావాలని హింట్స్ ఇస్తున్నాడా ? అసలు నిజాలు ఇవే..!

బిగ్ బాస్ హౌస్ రియాలిటీ షోలో అందరూ కూడా శనివారం హోస్ట్ ఎపిసోడ్ కోసమే ఎదురుచూస్తారు. ఎందుకంటే, హౌస్ మేట్స్ చేసిన తప్పులని ఎత్తిచూపిస్తూ వారిని హోస్ట్ తిడుతుంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సరిగ్గా 5వ వారం బెస్ట్ బడ్డీస్ టాస్క్ లో భాగంగా ఇదే బిగ్ బాస్ హౌస్ లో జరిగింది. శోభా ఇంకా ప్రియాంక ఇద్దరికీ క్లాస్ పీకుతూ నీ డెసీషన్ వల్ల ప్రియాంక నష్టపోయిందని కెప్టెన్సీ కంటెండర్ కాలేకపోయిందని నాగ్ పైర్ అయ్యారు. అలాగే ప్రియాంక తీస్కున్న డెసీషన్ కూడా సరిగ్గా లేదని, తేజని అవుట్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయ పడ్డారు.

దీంతో ప్రియాంక ఏదో కవర్ చేస్కోబోయింది కానీ నాగ్ వినిపించుకోలేదు. ఆ తర్వాత బెస్ట్ బడ్డీస్ కాదు మీరు క్రైమ్ బడ్డీస్ అంటూ సందీప్ ఇంకా అమర్ దీప్ లని ఒక ఆట ఆడుకున్నాడు కింగ్ నాగార్జున. ముఖ్యంగా సందీప్ చేసిన మిస్టేక్స్ ని చూపిస్తుంటే ముఖంలో నెత్తుడి చుక్క లేదు సందీప్ కి. అలాగే అమర్ అరవడం వల్ల గెలవలేవని చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే, అమర్ స్మైలీ టాస్క్ లో పళ్లు పేర్చకుండా బెల్ కొట్టడం తప్పా కాదా అని స్ట్రయిట్ గా అడిగారు కింగ్ నాగార్జున. తప్పే అని చెప్తూ నేను అప్పుడు రన్నింగ్ లో ఉంటే మాస్టర్ వెళ్లి కొట్టారని చెప్పాడు.

అలాగే, సందీప్ నింజా టాస్క్ లో కింద పడిపోయిన బత్తాయిలని సైతం లోపల వేశాడని, అలాగే తొక్కలు కూడా జ్యూస్ లో కలిపేశాడని సాక్ష్యంతో సహా చూపించారు. ఇక దొంగతనం టాస్క్ లో కూడా బిగ్ బాస్ చెప్పింది తప్పించి మిగతా అంతా చేశావని సందీప్ ని ఒక ఆట ఆడుకున్నారు. శుభశ్రీ గౌతమ్ జోడీకి కూడా సున్నితంగా క్లాస్ తీస్కున్నాడు నాగ్. శుభశ్రీ ఎందుకు శాక్రిఫైజ్ చేసింది. ఎందుకు మాట్లాడను అనేసరికి రెచ్చిపోయిందనేది తన నోటి నుంచే చెప్పించారు. అలాగే, స్మైలీ టాస్క్ లో వాళ్లు ఆడిన ఫౌల్ గేమ్ గురించి కూడా చెప్పారు.

ఆ తర్వాత శివాజీ ప్రశాంత్ జంటని పొగుడుతూనే స్మైలీ టాస్క్ ఇంకా నింజా టాస్క్ లో ఎందుకు అక్కడ సంచాలక్ ని ప్రశ్నించలేకపోయావని శివాజీని నిలదీశాడు. ఆ తర్వాత ప్రిన్స్ యావార్ కి ఇంకా తేజకి క్లాప్స్ కొట్టారు. వీళ్లిద్దరి జోడీ బాగుందని ప్రశంసించారు. గతవారం ఆడిన టాస్క్ ల ప్రకారం హౌస్ మేట్స్ కి క్లాస్ పడ్డాక అందరి ముఖాలు వాడిపోయాయి. నాగార్జున ఇలా సందీప్ ఇంకా అమర్ దీప్ లని తిట్టడం, శోబా ఇంకా ప్రియాంకలకి గేమ్ ఎలా ఆడాలో చెప్పడం అనేది బయట ఏం జరుగుతోందనేది స్ఫష్టంగా హింట్స్ ఇస్తున్నారా అనిపిస్తోంది.

ఎందుకంటే, లాస్ట్ వీక్ కూడా వీరిద్దరికే గట్టిగా పడ్డాయి. ఇప్పుడు కూడా వీళ్లిద్దరికే గట్టిగా పడ్డాయి దీంతో బిగ్ బాస్ మేనేజ్మెంట్ కావాలనే వీరికి హింట్స్ ఇస్తూ ప్రత్యర్థులు ఎవరో క్లియర్ గా చెప్తున్నారా అనిపిస్తోంది. దీనిమీద బిగ్ బాస్ ఆడియన్స్ కూడా స్టార్ మా బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్నారనే అంటున్నారు. మరి ఇది ఇలాగే సాగితే ఈ సీజన్ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుందని చెప్తున్నారు. అదీ మేటర్.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus