Nagarjuna: నేను లేకుండా సక్సెస్‌ మీటా… డైరెక్టర్‌పై నాగార్జున కామెంట్స్‌!

సంక్రాంతి సీజన్‌లో ఆఖరిగా వచ్చి… ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయాన్ని అందుకున్న సినిమా ‘నా సామిరంగా’. నాగార్జున, అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ ముఖ్య పాత్రల్లో వచ్చిన ఈ సినిమాను సక్సెస్ సెలబ్రేషన్లు కాస్త ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సినిమాల సందడి అయిపోయింది అని అనుకుంటున్న తరుణంలో ‘మా విజయానందం’ ఇంకా ఉంది అంటూ ఇప్పుడు ప్రెస్‌ మీట్‌లు, ఇంటర్వ్యూలు పెట్టి హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన సక్సెస్‌ ప్రెస్‌ మీట్‌లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిజానికి ఆయన కాస్త సరదాగా ఆ మాటలు చెప్పినా… అలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చెప్పారు అంటూ చిన్నపాటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ‘సక్సెస్‌ మీట్‌’లో నాగార్జన, దర్శకుడు విజయ్‌ బిన్నీ, అల్లరి నరేష్‌తోపాటు ఇతర టీం మెంబర్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున విజయ్ బిన్నీని ఆటపట్టించాడు. ‘‘నేను లేకుండ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్ ఏంట్రా.. ఈ రోజు ఈవెంట్‌ అంటే నాకు నిన్న సాయంత్రం ఫోన్ చేసి చెప్పాడు.

అంటే నేను లేకుండానే ఈవెంట్ చేసేద్దామనుకున్నావా?’’ అంటూ విజయ్‌ని కాసేపు ఆడుకున్నాడు నాగ్‌. దీంతో అక్కడున్నవాళ్లంతా నవ్వేసుకున్నారు. అయితే నిజంగానే అలా చెప్పారా? అనే ప్రశ్న అయితే ఉంది. దీనికి సమాధానం ఏంటంటే… ఈవెంట్ చేద్దామని ముందు రోజే అనుకున్నారట. అందుకే అప్పుడు పిలిచారు. ఆ విషయం నాగ్‌కి తెలుసు కూడా. కావాలని తన దర్శకుడిని ఆటపట్టించేందుకు అలా అన్నాడట.

అన్నట్లు ఈ సినిమా మొత్తాన్ని ఓ పాటలా అందంగా తీశారని విజయ్‌ బిన్నిని నాగ్‌ పొగిడేశాడు. నిజానికి (Nagarjuna) నాగ్‌ చెప్పింది కరెక్టే. మాంటేజ్‌ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌గా విజయ్‌కి పేరు. అందుకు తగ్గట్టే ‘నా సామిరంగా’ చేశారు. కొన్ని సన్నివేశాల్లో నాగ్‌ని అద్భుతంగా చూపించారని మెచ్చుకోలు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్‌ను అయితే మరింత అందంగా చూపించారని కూడా అంటున్నారు. ఒక యువ దర్శకుడికి ఇలాంటి పేరు రావడం గొప్పే కదా.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus