Bigg Boss 7 Telugu: వీకెండ్ నాగార్జున ఇచ్చిన హింట్స్ ఏంటి ? అసలు ఏం జరిగిందంటే.!

బిగ్ బాస్ షో లో హౌస్ మేట్స్ ని హోస్ట్ వీకెండ్ రోస్ట్ చేస్తుంటే ఆడియన్స్ కి యమా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అయితే, ఈసారి రోస్టింగ్ తో పాటుగా కొంతమందికి బూస్టింగ్, మరికొంతమందికి ఇంట్రస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పాడు కింగ్ నాగార్జున. 7వ వారం ఆటలో భాగంగా కెప్టెన్ అయిన అర్జున్ ని బాగా పొగిడారు. వచ్చిన రెండు వారాల్లోనే టాస్క్ బాగా ఆడావ్ అని, కెప్టెన్ అయ్యావని అన్నాడు.

ఆ తర్వాత సందీప్ గేమ్ లో చేస్తున్న పొరపాట్లు చాలా అర్దమయ్యేలా చెప్పారు. అంతేకాదు, పల్లవి ప్రశాంత్ ఊరోడు అనే నింద వేసింది కరెక్ట్ కాదని, వీడియోలు మొత్తం వెతికినా ఎక్కడా అది దొరకలేదని చెప్పారు. దీంతో పల్లవి ప్రశాంత్ ముఖం మాడిపోయింది. అంతేకాదు, నాగార్జున అడిగే పాయింట్స్ కి బిక్క చచ్చిపోయాడు. డ్యాన్స్ మీద, జ్యోతిమీద ఇలా ఒట్లు వేయద్దంటూ సందీప్ కి చెప్పారు. అంతేకాదు, టాస్క్ లలో ఫౌల్ గేమ్ ఆడకుండా ఆడితే నీ ఆలోచనకి చాలా బాగా గేమ్ ఆడతావ్ అంటూ హింట్ ఇచ్చారు.

అలాగే, అమర్ దీప్ కి వెల్ డన్ అనే కేక్ పంపి మంచి బూస్టప్ ఇచ్చారు. నీ గేమ్ చాలా బాగుంది. మంచిగా ఉంది. ఇలాగే గేమ్ ఆడు అంటూ హింట్ ఇచ్చారు. అలాగే, శోభాశెట్టికి కూడా తన గేమ్ ఎక్కడ మిస్ అవుతోందో చాలా క్లారిటీగా చెప్పారు. నువ్వు చెప్పే పాయింట్ లో అర్ధం ఉన్నా కూడా వేరేవాళ్లకి అది సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నావని, అప్పుడప్పుడు మోనితలాగానే మాట్లాడుతున్నావేమో అంటూ హింట్ ఇచ్చారు. ఇక్కడే తేజతో ఇచ్చే కంటెంట్ చాలా బాగుందని ఇండైరెక్ట్ గా కూడా చెప్పారు.

ప్రియాంక విషయంలో కూడా హోస్ట్ నాగార్జున క్లాస్ పీకుతూనే అనవసరమైన విషయాలు మైండ్ లో పెట్టుకోవద్దని దానివల్ల గేమ్ లో ముందుకు వెళ్లలేకపోతున్నావనే హింట్ ఇచ్చారు. ఇలా స్టార్ మా బ్యాచ్ కి మొత్తం ఇండైరెక్ట్ గా గేమ్ లో లోపాలని చెప్పారు హోస్ట్ నాగార్జున. దీంతో శనివారం పెద్దగా క్లాస్ పడకపోయినా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడం వల్ల గేమ్ లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఏమాత్రం కొంచెం బుర్ర ఉపయోగించినా నాగార్జున ఇచ్చిన హింట్స్ అనేవి చక్కగా ఉపయోగపడతాయి.

అయితే, సందీప్ గేమ్ లో బాగా ఆడుతున్నా, దొంగదారి వల్ల దెబ్బతింటున్నావనేది మాత్రం బాగా అర్ధమైంది. ఈసారి మాత్రం టాస్క్ లో ఫైయిల్ గేమ్ ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇలా హౌస్ మేట్స్ కి కుండబద్దలు కొట్టి నిజాలు చెప్పిన నాగార్జున , తర్వాత హౌస్ మేట్స్ తో స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడించాడు. ఇందులో వారి ఆటని పైకి తీస్కుని వెళ్తోంది ఎవరు ? ఆటలో పాములా మారి మింగేస్తోంది ఎవరు అనేది హౌస్ మేట్స్ చెప్పారు.

ఇక్కడ శివాజీకి ఎక్కువగా పాము వచ్చాయి. అలాగే ఎక్కువగా నిచ్చెన కూడ వచ్చాయి. దీంతో శివాజీ అందరితో సమానంగా ఉండమని అందరికీ నీ సలహాలు కావాలని, అందరినీ సపోర్ట్ చేయమని ఇది బుర్రలో ఎక్కించుకోమని శివాజీకి కూడా హింట్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. మరి ఈ హింట్స్ తో వచ్చేవారం  (Bigg Boss 7 Telugu) హౌస్ మేట్స్ గేమ్ ఎలా ఆడతారు అనేది ఆసక్తికరం.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus