క్రేజీయస్ట్ బాలీవుడ్ ఫిలిమ్ లో నాగార్జున!

అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం “లోక్ కార్గిల్” అనే హిందీ చిత్రంలో నటించిన నాగార్జున ఆ తర్వాత మళ్ళీ బాలీవుడ్ వైపు చూడలేదు. తెలుగులో సూపర్ స్టార్ డమ్ ఉండగా.. బాలీవుడ్ లో ఏదో కొత్త హీరోలా పరిచయమవ్వడం, ప్రయత్నించడం ఎందుకు అనుకొన్నాడో ఏమో కానీ బాలీవుడ్ ను లైట్ తీసుకొన్నాడు. ఆ తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ చాలా సున్నితంగా తిరస్కరించారు నాగార్జున. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత నాగార్జున ఓ బాలీవుడ్ సినిమా అంగీకరించారు. అది కూడా క్రేజీయస్ట్ ఫిలిమ్ గా పేర్కొనబడుతున్న “బ్రహ్మాస్త్ర” చిత్రంలో.

రణబీర్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆలియా భట్ కథానాయికగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ ముఖ్యపాత్రలో నాగార్జున నటించనున్నారు. ఇటీవల నానితో కలిసి నటిస్తున్న “దేవదాసు” షూటింగ్ కంప్లీట్ చేసుకొన్న నాగార్జున ఇవాల్టినుంచి ముంబైలో జరగనున్న “బ్రహ్మాస్త్ర” షూటింగ్ లో పాల్గొంటారు. 2019లో విడుదలకానున్న ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ కనుక క్లిక్ అయితే.. అక్కడ కూడా ఆయన బిజీ అయిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus