సూపర్ హిట్ బాలీవుడ్ ఫిలిమ్ రీమేక్ లో నాగ్

“మన్మధుడు 2” తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయకుండా.. “బిగ్ బాస్ సీజన్ 3″తో టైమ్ పాస్ చేస్తున్న నాగార్జున.. ఇప్పుడు ఆ షో చివరి దశకు చేరుకోవడంతో ఆ షో కంప్లీట్ అయ్యేలోపు తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. నిజానికి “బంగార్రాజు” మొదలవ్వాలి కానీ.. నాగార్జునకి ఎందుకో ఫైనల్ స్క్రిప్ట్ మీద నమ్మకం రావడం లేదు, మరోసారి కళ్యాణ్ కృష్ణను క్లైమాక్స్ మార్చి రాయమన్నాడట. దానికి ఎలాగో మరికొన్ని నెలల టైమ్ పట్టడం ఖాయం. ఈలోపు ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట నాగార్జున.

అందుకే.. బాలీవుడ్ లో విడుదలై మంచి విజయం సొంతం చేసుకొన్న “రైడ్” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలోపడ్డాడట నాగ్. హిందీలో అజయ్ దేవగన్, ఇలియానా జంటగా రూపొందిన ఆ చిత్రం మంచి కలెక్షన్స్ తోపాటు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది. అయితే.. హిందీలో సౌరభ్ శుక్లా పోషించిన పాత్రను తెలుగులో ఒక సీనియర్ ఫీమేల్ లీడ్ తో చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది ఎప్పటికీ వర్కవుట్ అవుతుందో, అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus