ఖరారు అయిన నాగార్జున, నాని సినిమా రిలీజ్ డేట్

రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన ఆఫీసర్ మూవీ వాయిదాలు పడుతూ.. జూన్ వరకు వెళితే…. నాగ్ తర్వాతి చిత్రం రిలీజ్ డేట్ ఇప్పుడే ఫిక్స్ అయిపోయింది. డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నానితో కలిసి నాగ్ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మొదటి షెడ్యూల్  హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్లో జరిగింది. నాని, రష్మిక మందన్న, సంపూర్ణేష్ బాబులపై కొన్ని  సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ రామోజీఫిల్మ్ సిటీలో వేసిన కాలనీ సెట్లో సాగుతోంది. మే 10 నుంచి ఈ షూట్ లో నాగ్ జాయిన్ అయ్యారు.

ఈ చిత్రంలో నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. నాగార్జున డాన్ పాత్రలో అలరించబోతున్నాడు. కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న  ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. మహానటితో వైజయంతి మూవీస్ మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. అలాగే ఎన్నో హిట్ పాటలు అందించిన మణిశర్మ ఈ సినిమాకి అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వనున్నారు. అరుదైన కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus