Venkatesh Daughter Engagement: వెంకటేశ్ కూతురి గతంలో కనిపించని స్టార్ హీరో.. ఇద్దరికీ మాటలు లేవా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ వివాహం జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే కీరవాణి కుమారుడు వివాహం కూడా జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి ఇక దగ్గుబాటి కుటుంబంలో కూడా వివాహం జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. వెంకటేష్ రెండవ కుమార్తె హయవాహిని పెళ్లి చేసుకోబోతోంది. ఈ క్రమంలోనే వెంకటేష్ తన కుమార్తె నిశ్చితార్థపు వేడుకను గురువారం విజయవాడలో ఎంతో ఘనంగా నిర్వహించారు.

వెంకటేష్ తనకు సంబంధించిన ఏ విషయాలను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇలా తన కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా చాలా గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు ఈ క్రమంలోనే తన కుమార్తె నిశ్చితార్థానికి సంబంధించిన విషయాన్ని ఎక్కడ బయట పెట్టకపోయినా ఇండస్ట్రీకి సంబంధించిన అందరి సెలబ్రిటీలను కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే వెంకటేష్ కుమార్తె నిశ్చితార్థానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరయ్యారు.

ఈ నిశ్చితార్థ వేడుకలలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు మహేష్ బాబు దంపతులు హాజరై సందడి చేశారు అలాగే రానా నాగచైతన్య వంటి హీరోలు కూడా ఈ నిశ్చితార్థ వేడుకలలో సందడి చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో దూరంగా ఉన్నారని తెలుస్తోంది. అక్కినేని హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నాగార్జున ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరుకాలేదు.

ఈ నిశ్చితార్థ వేడుకకు నాగార్జునని వెంకటేష్ పిలవలేదా కావాలనే ఆయనని దూరం పెట్టారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే నాగార్జున వెంకటేష్ మధ్య గత కొంతకాలంగా మాటలు లేవనే తెలుస్తుంది ఎప్పుడైతే వెంకటేష్ సోదరి లక్ష్మికి నాగార్జున విడాకులు ఇచ్చారు. అప్పటినుంచి నాగార్జునతో దగ్గుబాటి కుటుంబానికి మాటలు లేవని కానీ నాగచైతన్యతో మాత్రం చాలా మంచిగా ఉంటారని తెలుస్తోంది అందుకే ఈ వేడుకకు నాగచైతన్య హాజరైనప్పటికీ నాగార్జున మాత్రం దూరంగా ఉన్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus