Nagarjuna: బిగ్ బాస్ షోకు నాగార్జునకు ఆ రేంజ్ లో పారితోషికం దక్కుతుందా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్3 నుంచి బిగ్ బాస్ షో సీజన్7 వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున హోస్టింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. నాగ్ వల్లే బిగ్ బాస్ షో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటోందని చాలామంది భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో సీజన్7 కు నాగార్జున రెమ్యునరేషన్ గురించి తెలిసి బిగ్ బాస్ షో అభిమానులు అవాక్కవుతున్నారు.

నాగార్జునకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం దక్కుతోందని సమాచారం. నాగార్జున ఒక్కో సినిమాకు తీసుకుంటున్న పారితోషికంతో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో ఈ సినిమాకు పారితోషికం అందుకుంటున్నారు. త్వరలో బిగ్ బాస్ షోలో మరి కొందరు కంటెస్టెంట్లు పాల్గొననున్నారని తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో కొత్త కంటెస్టెంట్ల ఎంట్రీ ఉండనుందని సమాచారం. ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకునే కంటెస్టెంట్లు బిగ్ బాస్ షో సీజన్7 లో ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.

అర్జున్ అంబటి, జబర్దస్త్ నరేష్, పూజా మార్తి, ఫర్జానా మరి కొందరి పేర్లు ఈ జాబితాలో ఉండగా ఈ షోలో ఎవరు కనిపిస్తారో చూడాల్సి ఉంది. నాగార్జున ప్రస్తుతం నా సామిరంగ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున 99వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. నా సామిరంగ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నాగార్జున (Nagarjuna) గత సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. నా సామిరంగ సినిమా షూటింగ్ కు నాగార్జున ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సంక్రాంతికి కచ్చితంగా సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్న నాగార్జున ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. నాగార్జునను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus