‘బిగ్ బాస్’ రియాలిటీ షో తెలుగులో ఏ రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. టి.ఆర్.పి రేటింగ్ ల విషయంలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది బిగ్ బాస్.అలాంటి బిగ్ బాస్ ఇప్పుడు ఓటిటిలో కూడా సందడి చేస్తుంది. ‘బిగ్ బాస్’ నాన్ స్టాప్ పేరుతో ఓటిటి వెర్షన్ మొదలైంది. 24 గంటల పాటు హాట్ స్టార్ లో ‘బిగ్ బాస్’ ప్రసారం అవుతుంది.
కాబట్టి ఎవరు ఏ టైములో అయినా బిగ్ బాస్ చూడొచ్చు.17మంది కంటెస్టెంట్లతో ఈ సీజన్ మొదలైంది.అయితే ఈసారి షోని కొంచెం కొత్త పద్దతిలో ప్రారంభించారు. గత సీజన్లలో పాల్గొన్నవారిని వారియర్స్ గా, కొత్తగా వచ్చిన వాళ్ళని ఛాలెంజర్స్ గా హౌస్లోకి పంపించారు. ఈ ఓటిటి సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కానీ ఈ ఓటిటి సీజన్ కు శనివారం మాత్రమే హోస్ట్ గా కనిపించబోతున్నారు నాగార్జున.
మరి ఈసారి నాగార్జునకి ఎంత పారితోషికం అందుతుంది అనే సందేహం అందరిలోనూ ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం… బిగ్ బాస్ నాన్-స్టాప్ ను హోస్ట్ చేయడానికి నాగార్జున రూ.6 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారట. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలీదు కానీ బిగ్ బాస్ పారితోషికం వాయిదాల పద్ధతిలోనే ఇస్తారు. మొదట అడ్వాన్స్ గా కొంత. నెల రోజులు పూర్తయ్యాక ఇంత… సగం సీజన్ అయ్యాక కొంత అని బిగ్ బాస్ వాళ్ళ లెక్కలు ఉంటాయి.ఇప్పటికైతే నాగార్జున కి రూ.2 కోట్లు అందినట్టు సమాచారం.