Nagarjuna: కల్కి ట్రైలర్ కు నాగార్జున రివ్యూ.. ఏం ప్రపంచం సృష్టించారంటూ?

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  మూవీ ట్రైలర్స్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రెండు ట్రైలర్లు ఒక ట్రైలర్ ను మించి మరొకటి ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపించాయి. ఇప్పటికే రాజమౌళి (Rajamouli) కల్కి ట్రైలర్ గురించి తన అభిప్రాయాలను పంచుకోగా తాజాగా ఆ జాబితాలో నాగార్జున (Nagarjuna) కూడా చేరడం గమనార్హం. నాగార్జున కల్కి ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

నాగ్ తన ట్వీట్ లో ఏం ప్రపంచం సృష్టించారు మీరు నాగీ అని కామెంట్ చేశారు. నాగ్ అశ్విన్ మన దేశపు అపురూపమైన కథలను తెరపైకి తీసుకొస్తున్నారని నాగార్జున చెప్పుకొచ్చారు. కల్కి సినిమాను థియేటర్లలో చూడటానికి ఎగ్జైట్ గా ఫీలవుతున్నానని నాగార్జున అన్నారు. ఈ సినిమాను చూడటానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నానని ఆయన కామెంట్లు చేశారు. ప్రయోగాలు చేసే ప్రభాస్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నానని కమల్ హాసన్ లుక్ వావ్ అనేలా ఉందని అమితాబ్ (Amitabh Bachchan)  ఫైర్ అంటూ నాగార్జున అభిప్రాయపడ్డారు.

కల్కి మేకర్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన నాగార్జున దేవుడు ఆశీర్వదిస్తాడంటూ కామెంట్లు చేశారు. కల్కి సినిమాకు అన్నీ అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సృష్టించే రికార్డులు మామూలుగా ఉండవని తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది.

సాధారణంగా నాగార్జున ఇతర హీరోల సినిమాల గురించి ప్రస్తావించడం అరుదుగా జరుగుతుంది. నాగార్జున ప్రస్తుతం కుబేర ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాదే రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నాగార్జున పారితోషికం 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. నాగ్ త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus