Nagarjuna: నాగ చైతన్య, అఖిల్ ల పై నాగార్జున స్పెషల్ కేరింగ్..!

నాగ చైతన్య, అఖిల్ ల కెరీర్ల విషయంలో నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చైతన్య విషయాన్ని పక్కన పెడితే అఖిల్ చేసే ప్రతీ సినిమా కథ ముందుగా నాగ్ ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అది సెట్స్ పైకి వెళ్తుంటుంది అని అంతా చెబుతుంటారు. అందులో ఎంతవరకు నిజముంది అనే విషయం పై క్లారిటీ అయితే లేదు. ఇక విషయంలోకి వస్తే.. ఇటీవల నాగ్ ఇద్దరు కొడుకులు హిట్లు కొట్టారు. ‘లవ్ స్టోరీ’ తో నాగ చైతన్య, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో అఖిల్ హిట్ అందుకున్నారు.

అలాగే నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ ‘నిన్నే పెళ్ళాడతా’ విడుదలై 25 ఏళ్ళు పూర్తిచేసుకుంది. దీంతో ఈ సినిమా విశేషాలను నాగార్జున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఈ చిత్రం ప్రారంభంలో బైక్ సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ లో నాగార్జున డూప్ లేకుండా చేశారట. ‘ఆ సీన్ కోసం చాలా స్పీడ్ గా బైక్ నడిపాను.ఆ సీన్లో పాల్గొన్న మేమంతా ఏకంగా గంటకి 80-90 మీటర్ల వేగంతో బైక్‌ నడిపాము. ఒక్కరు కింద పడినా మిగిలిన వాళ్ళంతా పడేవాళ్ళం.

అప్పుడు ఎలా నడిపానో నాకే తెలీదు. కానీ ఇప్పుడైతే అలా చేయలేను. మిగిలిన హీరోలకి కూడా రిస్కీ థింగ్స్‌ చేయొద్దనే సూచిస్తాను. మరీ ముఖ్యంగా నా పిల్లలకి అయితే అస్సలు వద్దని చెబుతాను’ అంటూ నాగార్జున తెలిపారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus