‘నిర్మల కాన్వెంట్‌’పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను – కింగ్‌ నాగార్జున

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ బేనర్స్‌పై కాన్సెప్ట్‌ ఫిలింస్‌ ప్రొడక్షన్‌ ఆధ్వర్యంలో నిమ్మగడ్డ ప్రసాద్‌, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ టీనేజ్‌ లవ్‌స్టోరి చిత్రం ‘నిర్మల కాన్వెంట్‌’. ఈ చిత్ర విశేషాలను తెలపడానికి సెప్టెంబర్‌ 9న అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కింగ్‌ నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్‌ పాల్గొన్నారు.రోషన్‌ ఫెంటాస్టిక్‌గా చేశాడు!!

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ – ”నిర్మలా కాన్వెంట్‌’ ఆడియో లాంచ్‌లో చాలా హ్యాపీగా వున్నాను. ఆడియోలో రోషన్‌ మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యం వేసింది. చాలా చాలా బాగా మాట్లాడాడు. చిన్న వయసులోనే అంత డెప్త్‌ వెళ్ళి మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. షూటింగ్‌లో కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. అలాంటిది ఆడియోలో స్టేజి మీద అద్భుతంగా మాట్లాడి వాళ్ల అమ్మా, నాన్నలని ఏడిపించాడు. వారిని చూస్తే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. అంత సేపు స్పెల్‌ బౌండ్‌గా మాట్లాడాడు. సినిమా అంతా చూశాను. చాలా బాగా కాన్ఫిడెంట్‌గా చేశాడు. వన్‌ ఇయర్‌ బ్యాక్‌ ఈ కథని కాన్సెప్ట్‌ ఫిలింస్‌ వారు ప్రసాద్‌గారికి, నాకు విన్పించారు. మాకు బాగా నచ్చింది. ప్రసాద్‌గారికి ఎప్పట్నుంచో నాతో కలిసి సినిమా తీద్దామని ఇంట్రెస్ట్‌. ఆయన బిజినెస్‌లోకి నేను ఎంటర్‌ అయ్యాను. నా సినిమా బిజినెస్‌లోకి ఆయన్ని తీసుకు వచ్చాను. ఏదో బిజినెస్‌ చేసి డబ్బులు సంపాదించటంకన్నా ఫ్రెండ్లీ ఎట్మాస్ఫియర్‌లో మేం ఇద్దరం కలుసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఇన్నోవేటివ్‌ థాట్స్‌తో ఏదైనా కొత్త కొత్తగా చేయడం ప్రసాద్‌గారికి బాగా ఇష్టం. కంపెనీస్‌లోగానీ, బిజినెస్‌లోగానీ కొత్తగా చేయడానికి ట్రై చేస్తారు. అలాగే కొత్తదనం అంటే నాకు ఫస్ట్‌ నుండి ఇష్టం. మా ఇద్దరి మెంటాలిటీ బాగా కలిసింది. సో.. అలా మా ఈ జర్నీ స్టార్ట్‌ అయ్యింది. ప్రసాద్‌గారు ఫిలింస్‌ ఎక్కువగా చూస్తారు. ప్రతి సినిమా టిక్కెట్‌ కొనుక్కుని థియేటర్‌లోనే చూస్తారు. ఇంట్లో చూడరు. అన్నీ రకాల మూవీస్‌ చూస్తారు. ఎక్కువగా తెలుగు మూవీస్‌ అంటే బాగా చూస్తారు.

ఆ ఇంట్రెస్ట్‌తో ఈ మూవీ తీయడానికి ముందుకొచ్చారు. ఈ సినిమాలో కైలాష్‌ ఖేర్‌ పాడిన ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ పాట కాన్సెప్ట్‌ ప్రసాద్‌గారు చెప్పిందే. ఈ సినిమా మా ఇద్దరికీ బ్యూటిఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. నేను ఈ చిత్రంలో ఒక మెయిన్‌ సపోర్టింగ్‌ రోల్‌లో యాక్ట్‌ చేశాను. వెరీ వెరీ ఇంపార్టెంట్‌ రోల్‌. ఫస్ట్‌హాఫ్‌లో అక్కడక్కడా కన్పిస్తూ సెకండాఫ్‌లో త్రూ అవుట్‌ ఫిలిం అంతా వుంటాను. డెఫినెట్‌గా ఈ సంవత్సరం సపోర్టింగ్‌ రోల్‌ అవార్డ్‌ వస్తుందనుకుంటున్నాను. పూర్తిగా ఇదొక న్యూ ఎక్స్‌పీరియన్స్‌ నాకు. లవ్‌ స్టోరీస్‌ అంటే నాకు బాగా ఇష్టం. ‘నిర్మలా కాన్వెంట్‌’ ఫ్రెష్‌ అండ్‌ ప్యూర్‌ టీనేజ్‌ లవ్‌స్టోరి. రోషన్‌, శ్రియా శర్మ ఎక్స్‌ట్రార్డినరీగా నటించారు. ఈ సినిమా రోషన్‌తో పాటు రాజీవ్‌, సుమ కనకాల అబ్బాయి రోషన్‌ కనకాల, ప్రభాకర్‌ గారి అబ్బాయి చంద్రహాస్‌లను నటులుగా పరిచయం చేస్తున్నాం. అలాగే సింగర్‌గా నన్ను, నిర్మాతగా ప్రసాద్‌గారు, సంగీత దర్శకుడిగా రోషన్‌ సాలూరి, కెమెరామెన్‌గా విశ్వేశ్వర్‌, దర్శకుడిగా నాగకోటేశ్వరరావు, సింగర్స్‌గా ఎ.ఆర్‌.రెహమాన్‌ తనయుడు ఎ.ఆర్‌. అమీన్‌, శంకర్‌ మహదేవన్‌ అబ్బాయి సిద్ధార్థ మహదేవ్‌లను ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. సినిమా మంచి హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. నాగచైతన్య, కళ్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మించే చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌, జగపతిబాబు, రావు రమేష్‌, సంపత్‌ తదితరులు నటిస్తారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తారు. ‘నిర్మలా కాన్వెంట్‌’ కెమెరామెన్‌ విశ్వేశ్వర్‌ ఫొటోగ్రఫి అందిస్తారు’ అన్నారు.ఫ్రెష్‌ టీనేజ్‌ లవ్‌స్టోరీ!!

ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత నిమ్మగడ్డ మాట్లాడుతూ – ”ఏ సినిమా చూసినా కూడా దాంట్లో లవ్‌ అనే ఎలిమెంట్‌ వుంటుంది. ‘నిర్మలా కాన్వెంట్‌’ ప్యూర్‌ లవ్‌స్టోరి. ఫ్రెష్‌గా వుంటుంది. సీన్స్‌ అన్నీ చాలా కొత్తగా ఫ్రెష్‌గా ఉంటాయి. టీనేజ్‌లో ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ. నాగార్జున, నేను బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఎన్నో బిజినెస్‌లు కలసి చేస్తున్నాం. కొత్త వాళ్లతో మూవీ తీయాలని మా ఇద్దరికీ ఫస్ట్‌ నుండి ఇంట్రెస్ట్‌ ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో నాకు పర్సనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఉంది. నాగేశ్వరరావు గారితో చాలా మెమరబుల్‌ మూమెంట్స్‌ స్పెండ్‌ చేశాను. సినిమాల గురించి కాకుండా జీవితం గురించి, వెరైటీ సబ్జెక్ట్స్‌ గురించి డిస్కస్‌ చేసుకునే వాళ్లం. అలా అన్నపూర్ణ స్టూడియోస్‌తో పర్సనల్‌ ఎటాచ్‌మెంట్‌ ఏర్పడింది. ఆ అటాచ్‌మెంట్‌తోనే నాగ్‌, నేను మంచి సినిమా తీయాలనుకున్నాం. ఇదే టైమ్‌లో జి.కె.తో పరిచయం అయింది. ఎప్పుడూ పాజిటివ్‌ ఎనర్జీతో జి.కె. ఉంటాడు. ఎంతో క్రియేటివిటీ, నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తి. ఈ స్టోరీ గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఢిల్లీలో ఎం.ఎస్‌.సి. చదివిన రోజుల్లో సెలవులకి వచ్చినపుడు ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘మయూరి’, ‘ప్రతిఘటన’ వంటి మంచి సినిమాలు చూశాను. అప్పట్లోనే రామోజీరావు గారు సినిమాలతో పాటు కొత్త కొత్త సినిమాలు స్టార్ట్‌ చేసి అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. టెట్రా ప్యాక్‌ ఇవాళ వచ్చింది. సోమా అనే డ్రింక్‌ ఆరోజుల్లోనే అడ్వాన్స్‌ టెక్నాలజీతో స్టార్ట్‌ చేశారు. ఇది చూసి చాలా ఆశ్చర్యపోయాను. చిన్న చిన్న సినిమాలు ఎన్నో తీశారు. నా మైండ్‌లో కూడా చిన్న సినిమాలు తీస్తే మంచిది. ఎంతో మంది యంగ్‌స్టర్స్‌ ఇండస్ట్రీకి వస్తారు.

చిన్న ఉదాహరణ ఏమిటంటే నేను మ్యాట్రిక్స్‌ కంపెనీ స్టార్ట్‌ చేసినపుడు ఒక ఆర్‌ & డి సీనియర్‌ని ఇంటర్వ్యూ చేశాను. అతను ఐదు నెలల శాలరీ డిపాజిట్‌ చేయమన్నాడు. అతని వయసు నలభై ఐదు. అతనికి ఇంత శాలరీ ఇచ్చే బదులు కంపెనీ కొనుక్కోవచ్చు కదా అనిపించింది. యంగ్‌స్టర్స్‌కి అవకాశం ఇవ్వాలని ఫిక్స్‌ అయ్యాను. ఇప్పటికీ మా కంపెనీల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారే వర్క్‌ చేస్తున్నారు. అలాగే నాగార్జునగారు, జి.కె. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఒక మనిషి గానీ, ఒక సంస్ధ గానీ సొసైటీకి తన నాలెడ్జ్‌తో ఒక మెసేజ్‌ని ఇవ్వాలి. నాలెడ్జ్‌ మీద ఎవరైనా డిపెండ్‌ అయితే అతను సక్సెస్‌ అయినట్లే. అలాగే ప్రేమ ఇన్‌స్పిరేషన్‌తో నాలెడ్జ్‌ ఈజ్‌ పవర్‌ అనే కాన్సెప్ట్‌తో నడిచే స్టోరీ ఇది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రోషన్‌లో ఇంత టాలెంట్‌ ఉందా అనిపించింది. అంత బ్యూటిఫుల్‌గా సాంగ్స్‌ని కంపోజ్‌ చేశారు. మ్యూజిక్‌ అంటే నాకు బాగా ప్రాణం. హార్ట్‌టచింగ్‌ మ్యూజిక్‌ చేశాడు రోషన్‌. ఎంతో మంది టాలెంట్‌ వున్న యంగ్‌స్టర్స్‌ని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నాం. ఆడియో వేడుకలో రోషన్‌ చాలా క్యూట్‌గా మాట్లాడాడు. నా సొంత కొడుకు మాట్లాడినట్టుగా అన్పించింది. ఏదైనా వ్యాపారంలో డబ్బులు వస్తాయి, పోతాయి. కానీ ఒక మంచి సినిమా చేశామన్న ఫీలింగ్‌ ఉంది. సొసైటీకి ఉపయోగపడే మంచి కథలతో సినిమాలు తీస్తాను” అన్నారు.

https://www.youtube.com/watch?v=MDr7KaElAzY

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus