Nagarjuna: పడాల్సిన నలుగురికి క్లాస్ పడింది..! అసలు జరిగింది ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ ఆఖరి వారానికి చేరుకుంది. కానీ, నాగార్జున మాత్రం హౌస్ మేట్స్ పై ఫుల్ ఫైర్ అయ్యారు. గతవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో చేసుకున్న ఆర్గ్యూమెంట్స్, మాట్లాడిన మాటలకి సీరియస్ అయ్యాడు. అంతేకాదు, అరియానా చేసిన పనికి ఫుల్ క్లాస్ పీకాడు. అరియానా గ్యాస్ స్టౌ గట్టుపైకి ఎక్కి డ్యాన్స్ చేస్తూ అక్కడ ముందుకు వచ్చే ప్రయత్నం చేసింది. దీంతో కిచెన్ లో పై నుంచీ కింద పడింది. పక్కనే ఉన్న బాబాభాస్కర్ చూస్తు ఉన్నారే తప్ప చెప్పలేదేంటని నాగార్జున నిలదీశారు.

అంతేకాదు, అరియానాకి ఫుల్ క్లాస్ పీకారు. అలాంటి ఫీట్స్ ఇంకెప్పుడూ చేయద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక తర్వాత నటరాజ్ మాస్టర్ కి ఒక రేంజ్ లో క్లాస్ పడింది. దేవుడా నన్ను చంపేయ్ అంటూ మాట్లాడిన మాటలు, బిందుని ఆడిపోసుకున్నవి అన్నీ చూపించి మరీ క్లాస్ పీకారు. ఇంత వయసు వచ్చింది, అయినా కూడా ఇలా మాట్లాడటం కరెక్టేనా అంటూ నిలదీశారు. మీ పాపకోసం ఆడుతున్నాను అన్నారు కదా, మరి ఆ పాప పెరిగి పెద్దైన తర్వాత మా డాడీ ఇలా గేమ్ ఆడారా అని అనుకుంటుంది కదా అంటూ ప్రశ్నించారు.

అలాగే, బిందు వాళ్ల నాన్నగారికి, బిందుకి క్షమాపణలు చెప్పించారు. ఇక తెలుగు, చెన్నై అంటూ విడదీసినందుకు చాలాసేపు నాగార్జున సీరియస్ అయ్యాడు. ఇప్పుడు ఇండియా అంతా ఒకే ఇండస్ట్రీ అంటూ మాట్లాడారు. దీంతో నటరాజ్ మాస్టర్ మోకాళ్ల మీద కూర్చుని తెలుగు ఆడియన్స్ అందరికీ క్షమాపణలు చెప్పారు. మరోవైపు కీమా బిర్యాని తెప్పించి మరీ బిందుకి క్లాస్ పీకారు. మాస్టర్ నీకంటే చాలా పెద్దవాడని అలాంటి ఆయన్ని రా అంటూ మాట్లాడావ్, తూ అంటూ పక్కకి ఉమ్మావ్ అని చాలా తప్పుచేశావని మందలించారు. అంతేకాదు, నటరాజ్ మాస్టర్ కి క్షమాపణలు సైతం చెప్పించాడు కింగ్ నాగార్జున.

ఈ ముగ్గురుతో పాటుగా బాబాబాస్కర్ కి సైత్ క్లాస్ పడింది. ఇంట్లో ఎగ్డిట్ ఫ్రేమ్ పైకి ఎందుకు ఎక్కాల్సి వచ్చిందని, ఇలా చేస్తే వాటిని కోతి చేష్టలు అంటారని బాబా మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. ఏది ఏమైనా ఈసారి ఆఖరి వారంలో అందరికీ గట్టిగానే కోటింగ్ పడింది. షో చివరకి వస్తున్నా కూడా హౌస్ మేట్స్ మద్యలో అస్సలు బాండింగ్ అనేది లేకుండా పోయింది. ఇన్ని రోజులు కలిసి ఉన్నా కూడా అందరూ ట్రోఫీ కోసమే హౌస్ లో వెయిట్ చేస్తున్నారు. తోటి హౌస్ మేట్స్ పట్ల ఎలాంటి కన్సర్న్ చూపించడం లేదనే చెప్పాలి. మరి ఈసారి సీజన్ లో మరి కప్ ఎవరికి వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus