Bigg Boss 7 Telugu: రీ ఎంట్రీలో అసలైన ట్విస్ట్ ..! ఎపిసోడ్ లో జరగబోయేది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లోకి ముగ్గురు భామలు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లకి వస్తారని చెప్పాడు హౌస్ట్ నాగార్జున. దీనికి హౌస్ మేట్స్ ఓటింగ్ చేయాల్సి ఉంటుందని వారిని ఓట్ అప్పీల్ చేస్కోమన్నారు. శుభశ్రీ, రతిక, థామిని ముగ్గురూ కూడా హౌస్ లోకి తాము ఎందుకు రావాలో హౌస్ మేట్స్ కి అప్పీల్ చేస్కున్నారు. హౌస్ మేట్స్ మద్దతు కోసం రిక్వస్ట్ చేశారు.

థామినీ అయితే నా పాటలు మీరు మిస్ అవుతున్నారని, వంటలక్కని మిస్ అయిపోతున్నారని చెప్పింది. రతిక అయితే నేను హౌస్ లో చేసిన మిస్టేక్స్ ని బయటకి వెళ్లి చూస్కుని రియలైజ్ అయ్యానని, హౌస్ లో టాస్క్ లో పెర్ఫామన్స్ ఇవ్వగలుగుతానని చెప్పింది. అలాగే శుభశ్రీ కూడా నా వందశాతం ఎఫోర్ట్స్ పెడతానని ఓట్ చేయమని రిక్వస్ట్ చేసింది. అయితే, ఇక్కడే బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే..,

బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిలో మెజారిటీ ఓటింగ్ శుభశ్రీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో శుభశ్రీ రీ ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్. అయితే, హోస్ట్ నాగార్జున మెజారిటీ ఓటింగ్ కాదని, లీస్ట్ ఓటింగ్ వచ్చిన వాళ్లు వస్తారని హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడంట. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లీస్ట్ ఓటింగ్ రతికకి వచ్చిందని అందుకే, రతిక రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని ఒక టాక్.

దీని ప్రకారం చూస్తే మరోసారి రతిక తన ఎంట్రీతో హౌస్ మేట్స్ కి ఝలక్ ఇవ్వబోతోందన్నమాట. మరి ఈ ఓటింగ్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ చరిత్రలో ఇలా హౌస్ మేట్స్ రప్పించుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ గా రతిక నిలుస్తుంది. ఇంకో మేటర్ ఏంటంటే., బిగ్ బాస్ హౌస్ లో ఈవారం ఎలిమినేషన్ కూడా ఫిమేల్ కంటెస్టెంట్ అయిన నయనీనే అయ్యింది.

శోభాశెట్టి అన్ అఫీషియల్ సైట్స్ లో లీస్ట్ లో ఉన్నా కూడా సీనియర్ కాబట్టి శోభాశెట్టిని పంపించలేదని , కావాలనే నయనీ పావనిని ఎలిమినేట్ చేశారని అంటున్నారు. బయట ఏం జరిగిందో పూసగుచ్చినట్లుగా హౌస్ మేట్స్ చెప్పిందని అందుకే బిగ్ బాస్ టీమ్ నయనీ పావనీని ఎలిమినేట్ చేశారట. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి సండే ఎపిసోడ్ లో నాగార్జున ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది చూడాలి. అదీ మేటర్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus