Nagarjuna: ఆ డైరెక్టర్ తో ముచ్చటగా మూడోసారి.. ‘అవసరమా?’ అంటున్న అక్కినేని ఫ్యాన్స్..!

అక్కినేని నాగార్జున.. తన జెనరేషన్ హీరోల్లో ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ.. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు.. మారుతున్న కాలంతో పాటు స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ సపరేట్ గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ గా, ప్రొడ్యూసర్ గా, హోస్ట్ గా బిజీగా ఉండే నాగ్ ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ తో సంక్రాంతి హిట్ కొట్టి, దసరాకి ‘ది ఘోస్ట్’ తో మరో డిఫరెంట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

ప్రస్తుతం బిగ్ బాస్ షూట్ లో ఉన్నారాయన. కార్తి ‘సర్దార్’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు కింగ్. నాగ్ తర్వాత సినిమా ఏ దర్శకుడితో అనే చర్చలు ఫిలిం సర్కిల్స్ తో పాటు అక్కినేని అభిమానుల్లోనూ జరుగుతున్నాయి. త్వరలో నాగ్ తన కెరీర్ లో ప్రెస్టీజియస్ ఫిలిం చెయ్యడానికి కొద్ది రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఆయన 100వ సినిమా మైలురాయిని చేరుకోబోతున్నారు.

ప్రేక్షకాభిమానులను మెప్పించే విధంగా పక్కా కమర్షియల్ లేదా కంప్లీట్ డిఫరెంట్ ఫిలిం చెయ్యాలని.. కొత్త కథ అయితే కొత్త దర్శకుడితోనైనా లేకపోతే ఎవరైనా స్టార్ డైరెక్టర్ తోనైనా సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది నాగ్ ఆలోచన. తెలుగులో కింగ్ ఇంట్రడ్యూస్ చేసినంత మంది దర్శకులను మరే హీరో కూడా చెయ్యలేదనే సంగతి తెలిసిందే. 100వ సినిమా కోసం కొద్ది రోజులుగా కథలు వింటున్నారు నాగార్జున. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తో నాగ్ తన 100వ సినిమా చెయ్యబోతున్నారట.

అది కూడా ‘మాస్’ సీక్వెల్ ‘మాస్ 2’ అని ట్విట్టర్ లో న్యూస్ వైరల్ అవుతోంది. ‘మాస్’ మూవీతో లారెన్స్ ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసింది నాగార్జునే. తర్వాత వీళ్ల కాంబోలో వచ్చిన ‘డాన్’ యావరేజ్ గా ఆడింది. సూపర్ హిట్ ‘మాస్’ కి లారెన్స్ సీక్వెల్ రెడీ చేసి నాగార్జునకి వినిపించారని.. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ‘‘సీక్వెల్ కాకపోయినా ‘మన్మథుడు 2’ చేదు జ్ఞాపకాన్నిచ్చింది కాబట్టి సీక్వెల్స్, పార్ట్ 2ల జోలికి వెళ్లకుండా మంచి కమర్షియల్ సినిమా చేస్తే బెటర్’’ అంటూ కొందరు అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus