నిన్నమొన్నటివరకూ “నవ మన్మధుడు” అనే ట్యాగ్ ను వరంగా భావించిన నాగార్జున ఇప్పుడు అదే ట్యాగ్ ను శాపంలా భావిస్తున్నాడు. అందుకు కారణం లేకపోలేదు.. తనను అందరూ ఇంకా 40 ఏళ్ల కుర్రాడిలా ఉన్నారని ప్రశంసించడంతో “మన్మధుడు 2″తో చిన్నపాటి ప్రయోగం చేశాడు నాగార్జున. రొమాన్స్ కాస్త శృతి మించిందనే కారణం చేత అక్కినేని వీరాభిమానులు కూడా “మన్మధుడు 2” చిత్రాన్ని అంగీకరించలేకపోయారు. దాంతో ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అప్పట్నుంచి నాగార్జున నెక్స్ట్ సినిమా ఏం చేయాలా అనే కన్ఫ్యూజన్ లో పడ్డాడు.
తన వయసుకు తగ్గట్లు పెద్ద తరహా పాత్రలు చేయాలా లేక తన ఇమేజ్ కు తగ్గట్లు రోమాంటిక్ సినిమాలు చేయాలా అని తెలియక తికమకపడుతున్నాడు నాగార్జున. అందుకే తన మోస్ట్ ఫేవరెట్ ప్రొజెక్ట్ అయిన “బంగార్రాజు” చిత్రాన్ని మరోసారి హోల్డ్ లో పెట్టాడని తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ మునుపటి చిత్రం “నేల టికెట్టు” డిజాస్టర్ గా నిలవడం కూడా అందుకు కారణం. ప్రస్తుతం నాగార్జున తెలుగులో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. మరి ఆయన తదుపరి సినిమా ఏమిటనేది తెలియాలంటే కొన్నాళ్లపాటు ఆగాల్సిందే.
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి