వైష్ణవ్ తేజ్ లిస్ట్ లో మరో సినిమా!

మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు వైష్ణవ్ కి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ‘ఉప్పెన’ సినిమాను పూర్తి చేసిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఓ సినిమాను మొదలుపెట్టి.. కొన్ని నెలల్లోనే దాన్ని పూర్తి చేసేసాడు వైష్ణవ్.

ఇప్పుడు ఈ మెగాహీరో.. టాప్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. హీరో నాగార్జున నటించడంతో పాటు సినిమాలను కూడా నిర్మిస్తుంటారు. యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడం కోసం అప్పుడప్పుడు మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తుంటారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కానున్నాడట.

దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగిపోయాయని.. వైష్ణవ్ కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతున్నారు. వైష్ణవ్ నటించబోయే తదుపరి సినిమా ఇదేనని సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. ఈ సినిమాతో పాటు వైష్ణవ్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి సినిమాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై వైష్ణవ్ ఓ సినిమా చేయబోతున్నాడు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus