నాగార్జునకు జంటగా కీర్తి సురేష్ ?

నాగార్జున హీరోగా ‘మన్మధుడు2’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. నాగార్జున పెద్ద కోడలు సమంత కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ చిత్ర కథ ప్రకారం మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. దీంతో కీర్తి సురేష్ ను ఎంచుకుంటున్నారని టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ విషయం పై చిత్ర యూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

‘మన్మధుడు2’ చిత్ర యూనిట్ ఈ విషయం పై స్పందిస్తూ… “మా సినిమాలో మ‌రో హీరోయిన్ అవ‌స‌ర‌మే. ఆ పాత్ర కోసం చాలా ఆప్ష‌న్స్ ఉన్నాయి. అందులో కీర్తి ఒక‌రు. త‌న డేట్లు స‌ర్దుబాటు అయితే.. త‌ప్ప‌కుండా మా చిత్రంలో నటిస్తుంది. మేం కీర్తిని సంప్ర‌దించాం. అయితే.. ఇంకా ఆమె నుండీ ఎటువంటి స్పంద‌న రాలేదు“ అంటూ చెప్పుకొచ్చారు. ఈ మాటల్ని బట్టి చూస్తే ‘మన్మధుడు2’ లో కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉన్నాయని అర్దమవుతుంది. కానీ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, త‌మిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఈ చిత్రంలో నటిస్తుందా అంటే.. అనుమానమనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus