నాగార్జునతో జతకట్టనున్న ప్రజ్ఞా జైస్వాల్..!

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో మరో భక్తిరస చిత్రం రానున్న సంగతి తెలిసిందే. బాబా హతీ రామ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగార్జున సరసన ప్రజ్ఞా జైస్వాల్ నటించనుందట. కంచె చిత్రంలో ఆమె నటనను చూసిన రాఘవేంద్రరావు.. ఆమె నటన నచ్చడంతో ప్రజ్ఞాను ఈ చిత్రంలో ఎంపిక చేశారని అంటున్నారు. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం షూటింగ్ కర్ణాటక బోర్డర్ లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేసుకొంటోంది చిత్ర బృందం.
కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండగా.. ఇప్పటికే రెండు పాటలు పూర్తి అయ్యాయని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఏ. మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags