అక్కినేని నాగార్జున (Nagarjuna) కెరీర్లో ‘శివమణి’ ఓ ప్రత్యేకమైన సినిమా. అప్పటివరకు నాగార్జున చాలా ప్రేమకథా చిత్రాల్లో, యాక్షన్ సినిమాల్లో నటించారు. కానీ ‘శివమణి’ పూరి మార్క్ ఓ టిపికల్ యాక్షన్ సినిమా అని చెప్పాలి. ‘శివమణి’ అనే క్యారెక్టర్లో నాగార్జున ఒదిగిపోయారు. ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ (Amma Nanna O Tamila Ammayi) సినిమాతో లాంచ్ చేసిన ఆసిన్ (Asin Thottumkal) ని, ‘ఇడియట్’ (Idiot) తో లాంచ్ చేసిన రక్షితని (Rakshita).. ‘శివమణి’ లో హీరోయిన్స్ గా పెట్టాడు పూరీ జగన్నాథ్.
‘వైష్ణో అకాడమీ’ సంస్థ పై పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్యతో (D. V. V. Danayya) కలిసి నిర్మించాడు. 2003 అక్టోబర్ 23న ‘శివమణి’ రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి ఫలితాన్నే అందుకుంది. 77 కేంద్రాల్లో 50 రోజులు, 34 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ‘శివమణి’. చిరంజీవి (Chiranjeevi) ‘ఠాగూర్’ (Tagore), ఎన్టీఆర్ (Jr NTR) ‘సింహాద్రి’ (Simhadri) సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ వాటి పోటీని తట్టుకుని ‘శివమణి’ సక్సెస్ సాధించడం విశేషంగా చెప్పుకోవాలి.
పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న శివమణికి అక్కడ దత్తు అనే రౌడీతో శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఊహించని విధంగా అతని మేనకోడలినే ప్రేమిస్తాడు హీరో శివమణి. ఈ విషయం తెలుసుకున్న దత్తు.. శివమణి ప్రొఫెషనల్ లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ ని, లవ్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తాడు.
తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ. ఈ కథని పూరీ తన స్టైల్లో క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాగార్జున క్యారెక్టరైజేషన్ అదిరిపోతుంది. ఇక ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ అంటే పూరీ రాసిన డైలాగులు. ఒకసారి ‘శివమణి’ లోని బెస్ట్ డైలాగ్స్ ని ఓ లుక్కేద్దాం రండి :
డైలాగ్ 1
డైలాగ్ 2
డైలాగ్ 3
డైలాగ్ 4
డైలాగ్ 5
డైలాగ్ 6
డైలాగ్ 7
డైలాగ్ 8
డైలాగ్ 9
డైలాగ్ 10
డైలాగ్ 11
డైలాగ్ 12