Wild Dog: ఓటిటిలో రికార్డులు సృష్టిస్తున్న నాగార్జున ‘వైల్డ్ డాగ్’..!

అక్కినేని నాగార్జున నుండీ వచ్చిన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’.అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి కలిసి నిర్మించారు.ఏప్రిల్‌ 2న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఆఫీసర్, ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడు. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరో కూడా ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించారు.

అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా కారణంగానే ఈ చిత్రం అక్కడ విజయం సాధించలేదు అని స్పష్టమవుతుంది. కానీ తాజాగా ఈ చిత్రం ఓటిటిలో విడుదలయ్యింది. ఇక్కడ మాత్రం ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుండడం విశేషం. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను కూడా పక్కకు నెట్టి.. ‘వైల్డ్ డాగ్’ గా నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుందట ‘వైల్డ్ డాగ్’. ఈ విషయాన్ని స్వయంగా నెట్ ఫ్లిక్స్ వారే అధికారికంగా ప్రకటించడం విశేషం.

అతి తక్కువ టైమ్ లో రికార్డ్ వ్యూస్ ను నమోదు చేసిన చిత్రంగా ‘వైల్డ్ డాగ్’ రికార్డు సృష్టించిందని వారు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సౌత్ సినిమాల్లో కూడా అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన చిత్రంగా ‘వైల్డ్ డాగ్’ నిలిచిందట. మరీ ముఖ్యంగా తెలుగు వెర్షన్ ఇండియా మొత్తం మీద టాప్ లో ఉండడం మరో విశేషం.ఇక తమిళ వెర్షన్ అయితే 5వ స్థానంలో నిలిచినట్టు వారు తెలియజేసారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus