ఇండస్ట్రీ మీద గౌరవంతోనే నా కుమార్తెను హీరోయిన్ ను చేశాను

  • April 18, 2018 / 06:59 AM IST

‘క్యాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూ ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. కొన్ని క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ నా వద్దకి వచ్చినప్పుడు నేను చెప్పుతో కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక అబ్బాయి కారణంగా ఒక అమ్మాయి సమస్య ఎదుర్కొన్నప్పుడు పోలీస్ వ్యవస్థను సంప్రదించవచ్చు. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉంది. నాకు ఇండస్ట్రీ అంటే విపరీతమైన అభిమానం ఉంది, ఆ గౌరవంతోనే నేను నా కుమార్తెను హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాను’ అంటూ మెగా బ్రదర్ నాగబాబు క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూపై స్పందించారు. అలాగే.. కొందరు జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ రోల్స్ ప్లే చేసే అమ్మాయిలకు బట్టలు మార్చుకోవడానికి, బాత్ రూమ్ కి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని నాకు ఎప్పట్నుంచో తెలుసు, ఆ విషయమై పరిష్కారానికి ఎప్పట్నుంచో ఆలోచిస్తున్నాను. త్వరలోనే సరైన పరిష్కారం పరిశ్రమ పెద్దలతో చర్చించి చెబుతా.

ఇక తెలుగు సినిమాల్లో తెలుగు ఆర్టిస్టులు మాత్రమే నటించాలి అనే రూల్ ని ఎవరూ పెట్టలేరు. మార్కెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకొని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సినిమా రూపొందించే నిర్మాతలను మాత్రం మా అసోసియేషన్ ఫోర్స్ చేయలేదు. ఈమధ్య ప్రతివాళ్లూ ఫిలిమ్ ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడడం అనేది కామన్ అయిపోయింది. సినిమాలోని చెడును ప్రభావం చూపుతున్నప్పుడు, మంచి ఎందుకు చూపడం లేదు. సైలెంట్ గా ఉన్నాం కదా అని ఎవరు పడితే వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం సరికాదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడడం అనేది స్వాగతించదగ్గ అంశం కాదు. దయచేసి ఇండస్ట్రీని తక్కువ చేసి చూడకండి, ఎందుకంటే కొన్ని లక్షల మంది చిత్రసీమపై ఆధారపడి బ్రతుకుతున్నారు.

ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, కళ్యాణ్ బాబు ఏం తప్పు మాట్లాడాడు అసలు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం తప్పా?. శ్రీరెడ్డి మొన్న పవన్ కళ్యాణ్ ను చాలా దారుణంగా తిట్టింది. నాకు చాలా కోపం వచ్చింది. మేం రియాక్ట్ అవ్వడం కంటే ముందు మా అభిమానులు, ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు రియాక్ట్ అయ్యారు. కళ్యాణ్ బాబు ఆల్రెడీ తన అభిమానులకు ఇలాంటి విషయాలపై రియాక్ట్ అవ్వొద్దని ఎప్పుడో చెప్పాడు. ప్రతి ఇష్యూకి ఆయన “దయచేసి ఎవరూ ఏమీ అనకండి కళ్యాణ్ చెప్పడు. ఆ అవసరం కూడా లేదు. ఇవన్నీ తెలియని వాళ్ళు,

ముఖ్యంగా అవుట్ సైడర్స్ ఈ విషయమై చేస్తున్న హడావుడి ఎక్కువయ్యింది. సైలెంట్ గా ఉన్నాం కదా అని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయకండి, ఎందుకంటే ఎలా రియాక్ట్ అవుతామో మాకే తెలియదు. ఒకవేళ తప్పు చేస్తే “నేను తప్పు చేశాను అని పబ్లిక్ గా ఒప్పుకొనే దమ్మున్న మొనగాడు నా తమ్ముడు”. నేను నా తమ్ముడితో మాట్లాడి దాదాపు ఆరు నెలలవుతుంది. వాడు ప్రజల్లోకి వెళ్లిపోయాడు. కోట్ల సంపాదించుకొనే స్టార్ డమ్ ఉంది వాడికి, వాడ్నా మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసేది. ఆడ కూతురు కాబట్టి ఆమెను ఏమీ అనకుండా వదిలేస్తున్నాం. ఈ విషయమై మా అమ్మని అడిగితే.. “పోన్లేరా వాళ్ళకి ఏమైనా ప్రోబ్లమ్స్ ఉంటే పట్టించుకోకు అని నవ్వేసింది. ఎవరైనా అంటే అన్నారు కానీ.. ఆమె కూడా ఆడపిల్లే కదా” అంది మా అమ్మ. అమెరికా హక్కుల నాయకుడు Malcolm X ఒక మాట అన్నారు : ‘politically motivated media కావాలంటే ఒక మంచివాడిని చెడ్డోడిని చేసేయగలవ్. ‘

దయచేసి మన ఛానెళ్లు అలా తయారవద్దు. TRPల కోసం పనిచెయ్యడం చెయ్యద్దండి. మీడియాకి ఇదే నా అభ్యర్ధన.
ఈ విషయం చెప్పడానికి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడ్రెస్ చేయడానికి చాలా సమస్యలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus