నాగార్జున ఆ డైరెక్టర్ తో చేస్తాడా..?

విభిన్న చిత్రాలను రూపొందిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. ఆయన రూపొందించిన ఏ సినిమా కూడా రెగ్యులర్ గా ఉండదు. కథ, కథనంలలో కొత్తదనం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఈ డైరెక్టర్ స్టార్ హీరోలతో సినిమా చేయలేదు. మోహన్ లాల్ వంటి సీనియర్ హీరోతో ‘మనమంతా’ చిత్రాన్ని రూపొందించినపప్పటికీ తెలుగు స్టార్ హీరోలు మాత్రం ఏలేటితో సినిమాలు చేయలేదు.

నిజానికి ఏలేటికి స్టార్స్ ను దృష్టిలో పెట్టుకొని కథలు రాయడం నచ్చదు. ఒకరకంగా ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడానికి ఇదొక కారణమని చెప్పొచ్చు. కానీ తాజా సమాచారం ప్రకారం ఏలేటి తొందరలోనే నాగార్జునతో సినిమా చేయబోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ గానం. వినడానికి బానే ఉంది కానీ నాగార్జున మంచి ఫామ్ లో ఉన్న ఈ సమయంలో ప్రయోగాత్మక సినిమా చేస్తాడా..? అనే అనుమానించాల్సిన విషయమే..! ఏమవుతుందో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus