పెళ్లి అనంతరం సినిమాల్లోకి నమిత రీఎంట్రీ

  • November 23, 2018 / 12:34 PM IST

వివాహానంతరం కొంతమంది నటీమణులు చిత్ర పరిశ్రమలోనికి పున: ప్రవేశిస్తున్న సంగతి చూస్తున్నదే. పెళ్లికి ముందు నటిగా సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగించిన నమిత.. తెలుగు, తమిళంలో అనేక సినిమాలలో నటించారు. ముఖ్యంగా తమిళనాట ఆమెకు మంచి క్రేజ్‌ కూడా ఉండేది. అయితే రాను రాను అవకాశాలు సన్నగిల్లడంతో ప్రేమించన వ్యక్తిని పెళ్లి చేసుకొని సైలెంట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త స్థిమితపడిన తర్వాత చాలామంది తారల కోవలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

బరువు పెరగడం వల్ల కూడా తనకు అవకాశాలు సన్నగిల్లాయని భావించిన ఆమె ఇప్పుడు బరువు తగ్గే పనిపై కూడా దృష్టి పెట్టిందని అంటున్నారు. అందులో భాగంగానే కసరత్తులు చేసి.. బరువు తగ్గిన ఆమె కాస్త స్లిమ్‌ అయ్యారు. తాజాగా ఆమె రీఎంట్రీ ఇస్తున్న అహంభావం చిత్రం తమిళ, తెలగు భాషల్లో రూపొందుతోంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నమిత గ్లామర్‌గా కనిపించదట. నటనకు బాగా అవకాశం ఉన్న పవర్‌ఫుల్‌ పాత్రలో ఆమె నటించినట్లు చెబుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఆమె బిజీ అవుతుందా? లేదా? అన్న అంశం విడుదల తర్వాతే తేలుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus