నమ్రత అంత మాట అనేశారేంటి..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి రెండే ప్రపంచాలు. ఒకటి సినిమా.. రెండు తన ఫ్యామిలీ. సినిమాలు చేస్తూ ఎంత బిజీగా గడుపుతున్నప్పటికీ.. తన కుటుంబం కోసం కూడా సమయం కేటాయిస్తుంటాడు మహేష్ బాబు. ఏడాదికి 6సార్లు వరకూ తన కుటుంబంతో విదేశాలకు వెళ్లొస్తుంటాని మహేష్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. అలాంటిది మహేష్ కు రెండో భార్య ఉందంటూ నమ్రత చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu Family

కంగారు పడకండి.. అసలు మ్యాటర్ ఏంటంటే.. మహేష్ మొదటి భార్య సినిమాలే అని. నేను అతనికి రెండో భార్యనని సరదాగా చెప్పింది. మహేష్ మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తాడో సినిమాలని కూడా అంతే విధంగా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చింది. ఇటీవల మహేష్, నమ్రత లు 15 ఏళ్ల పెళ్లి రోజు వేడుకని జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ డ్రెస్సింగ్ మరియు సినిమా ప్రమోషనల్ విషయాల్లో మాత్రమే నేను ఇన్వాల్వ్ అవుతానని.. తన సినిమాల కధల సెలెక్షన్ల విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వనని కూడా నమ్రత తెలిపింది. ఇక మహేష్ బాబు తరువాతి చిత్రాన్ని.. తనకి ‘మహర్షి’ వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus