Namrata: మహేష్ బాబు హీరోగా చేసిన సినిమాల్లో నమ్రతకు ఆ సినిమా అస్సలు నచ్చదంట..?

  • March 30, 2023 / 03:42 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్‌డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. బాలనటుడిగానే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.. హీరోగా పరిచయమైన తక్కువ టైంలోనే సూపర్ స్టార్ ట్యాగ్ దక్కించుకున్నారు.. వరుసగా సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నారు.. మరోపక్క పలు బ్రాండ్లకు ప్రమోటర్‌గానూ వ్యవహరిస్తున్నారు.. అలాగే ఏఎంబీ సినిమాస్, ఏషియన్ నమ్రత హోటల్స్ స్థాపించి ‘బిజినెస్‌మెన్’ గానూ రాణిస్తున్నారు.. అన్నిటికీ మించి ఆంధ్ర హాస్పిటల్స్ వారితో కలిసి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించారు..

ఇప్పటికే వెయ్యి మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి వారి పాలిట దేవుడిగా మారారు..ఇక ఫ్యామిలీకి మహేష్ ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకునే విధానంగానీ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. ఏడాదిలో కనీసం రెండు సార్లు భార్య, పిల్లలతో కలిసి విదేశాలకు టూర్ వేస్తుంటాడు.. ఇక పిల్లలు గౌతమ్ – సితారలకు సంబంధించిన విశేషాలన్నిటినీ నమ్రత సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు..

మహేష్ సినిమాలు, యాడ్స్, వ్యాపార విషయాలతో పాటు ఇంటి వ్యవహారాలన్నిటినీ చక్కబెడుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారామె.. ఇటీవల ఓ ఇంటర్వూలో పలు విషయాలు వెల్లడించిన సూపర్ స్టార్ సతీమణి, భర్త నటించిన సినిమాల్లో ఓ చిత్రం తనకు అస్సలు నచ్చదని చెప్పి షాక్ ఇచ్చారు.. వాస్తవానికి ఆమెకే కాదు ప్రేక్షకాభిమానులకు కూడా ఆ మూవీ అంతగా నచ్చలేదు.. అదే ‘సైనికుడు’.. ‘ఒక్కడు’, ‘అర్జున్’ తర్వాత మహేష్ – గుణ శేఖర్ కాంబోలో భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది..

మహేష్ చేసిన వాటిలో ‘సైనికుడు’ నచ్చదని చెప్పిన నమ్రత (Namrata) .. ఆయన సినిమాల్లో ఏదైనా చిన్న క్యారెక్టర్ చేస్తారా? అనడిగితే.. చెయ్యనని చెప్పారు.. ఇక మహేష్ – త్రివిక్రమ్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రెస్టీజియస్ ఫిలిం చేయనున్న సంగతి తెలిసిందే.. హీరోగా తనకు 29వ సినిమా ఇది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus