Namrata: రీ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నమ్రత!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబుకు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు బాలీవుడ్ నటి నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడినటువంటి మహేష్ బాబు నమ్రత అనంతరం పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

పెళ్లికి ముందు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నమ్రత (Namrata) పెళ్లి తర్వాత సినిమాలలో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కబెట్టడమే కాకుండా పలు వ్యాపార రంగంలో రాణిస్తూ మంచి గుర్తింపు పొందారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నమ్రతకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది..

ఈ సందర్భంగా నమ్రతను ప్రశ్నిస్తూ మీకు మహేష్ బాబు సినిమాలో కనుక నటించే అవకాశం వస్తే తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నమ్రత సమాధానం చెబుతూ.. తనకు మహేష్ బాబుసినిమాలు కీలకపాత్రలో నటించే అవకాశం తనకు వచ్చిన తాను తిరిగి సినిమాలలోకి రానని తనకు నటించే ఉద్దేశం ఏమాత్రం లేదు అంటూ ఈ సందర్భంగా నమ్రత సెకండ్ ఇన్నింగ్స్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎంతో క్రేజ్ ఉన్నటువంటి మహేష్ బాబు చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. ఇలాంటి హ్యాండ్సమ్ హీరో పక్కన నటించే అవకాశం కోసం ఎంతోమంది తారలు ఎదురుచూస్తున్నారు.అలాంటిది మహేష్ బాబు పక్కన నటించే అవకాశం వచ్చిన తాను తిరిగి సినిమాలలో నటించడానికి ఒప్పుకోనంటూ నమ్రత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus