మహేష్ బాబు భార్యగా నమ్రత అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె కూడా బాలీవుడ్ నటి అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక సినిమాలకు దూరంగా ఉన్నటువంటి నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
సినిమాలకు దూరంగా ఉన్నటువంటి నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఆమె తమ కుటుంబానికి ఎంతో కీలకమని తన లైఫ్ లో ఆమె పాత్ర చాలా ఉంది అంటూ నమ్రత పోస్ట్ చేశారు. మరి నమ్రత ఎవరిని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారు అనే విషయానికి వస్తే తన ఇంటి పనిమనిషి శాలిని గురించి నమ్రత ఈ పోస్ట్ చేయడం విశేషం.
శాలిని తన నాన్నమ్మ అమ్మమ్మని చూసుకోవడానికి మా ఇంటికి వచ్చిందని తెలిపారు. వారి తర్వాత మా అమ్మను అలాగే నన్ను ఇప్పుడు నా పిల్లలను కూడా చూసుకుంటున్నారని ఈమె తెలిపారు. ఇలా నాలుగు తరాలుగా మా ఇంట్లోనే ఉంటూ మా ఇంట్లో మనిషిగా ఉన్నారని ఈమె తెలిపారు. ఇక మా ఇంట్లో ఈమె ఎన్నో రకాల పాత్రలను పోషించారు. ఒక హౌస్ కీపింగ్ గాను, నాని గాను మదర్, గార్డియన్ గా ఎన్నో రకాల పాత్రలను పోషించిందని ఈమె తెలిపారు.
ఇకపోతే ఈమె (Namrata) పుట్టినరోజు నేడు కావడంతో సితార గౌతమ్ నమ్రత ముగ్గురు కలిసి ఈమె పుట్టినరోజు వేడుకలకు ఎంతో ఘనంగా జరిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసినటువంటి ఎంతోమంది ఒక పని మనిషికి నమ్రత ఇలాంటి ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా గ్రేట్ అని ఇది వారి మంచితనం అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు..